Ramya Krishna : అతను లేకపోతే తాను ఇప్పుడు ఎక్కడ ఉండేదాన్నో: రమ్యకృష్ణ

రమ్యకృష్ణ( Ramya Krishna ).హీరోయిన్ గా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చాలా ఏళ్లపాటు ఏకచిత్రాధిపత్యం చేసింది.

శివగామిగా, నీలాంబరిగా ఆమె చేసిన పాత్రలు దశాబ్దాల కాలం పాటు అలా గుర్తుండిపోతాయి అంతే.అంతలా సినిమా ఇండస్ట్రీలో ఆమె ప్రభావం ఉంటుంది.

ఆమె చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ అనే కూడా పేరుంది.సినిమాల్లో నటిస్తూనే డైరెక్టర్ కృష్ణవంశీతో ( director Krishnavanshi )ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది.

ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు.అయితే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రమే అంటుంది రమ్యకృష్ణ.

Advertisement

ఆయన ఒక్కడు లేకపోతే ఈ ఇప్పుడు నేను ఎక్కడ ఉండే దానిలో కూడా తెలియదు అంటుంది.

అంతలా తన జీవితాన్ని ప్రభావితం చేసిన రాఘవేంద్ర రావుకు( Raghavendra Rao ) జీవితాంతం తన చివరి శ్వాస వరకు కూడా కృతజ్ఞురాలుగా ఉంటానని ఎన్నోసార్లు ఆమె మీడియా ముఖంగా తెలిపింది.అయితే దర్శకేంద్రుడి పట్ల రమ్యకృష్ణకు ఇంతటి అభిమానం ఉండడానికి కారణం లేకపోలేదు.తాను 1984లో కంచు కాగడా అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని దాదాపు 15, 16 సినిమాలు తీసినా కూడా తనకు హీరోయిన్ అనే గుర్తింపు రాలేదు అని, కానీ ఆ సినిమాలు పరాజయం పాలవడానికి మాత్రం తానే కారణం అన్నట్టుగా తను ఒక అన్ లక్కీ హీరోయిన్ అని ముద్రవేశారని కన్నీటి పర్యంతం అయింది రమ్యకృష్ణ.

తనకు చెప్పకుండానే కొన్ని సినిమాల నుంచి కూడా తీసివేసారని అది తెలుసుకొని తాను చాలా కుండిపోయానని చెప్పింది అలాగే అన్ని శ్లోకాలు ఉన్నా కూడా తనకు అల్లుడుగారు అనే సినిమా ఇచ్చి తనను బ్లాక్ బాస్టర్ హీరోయిన్ గా మార్చారని అందుకు రాఘవేంద్ర రావుకి ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్తోంది.ఈ సినిమా 100 రోజుల వేడుకలో కూడా ఆమె ఈ విషయాన్ని చెబుతూ పదేపదే కన్నీళ్లు పెట్టుకుంది.ఆ తర్వాతే తనకు అన్ని భాషల్లో కూడా మంచి అవకాశాలు వచ్చాయని తనను స్టార్ హీరోయిన్ అంటూ అందరూ పిలుస్తుంటే దానికి పూర్తి బాధ్యుడు రాఘవేంద్ర రావే అని, చివరికి బాహుబలిలో శివగామి పాత్ర కూడా ఆయన వల్లే తనకు వచ్చిందంటూ కూడా చెబుతోంది రమ్యకృష్ణ.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు