ఆశ్చర్యపర్చుతున్న యాక్షన్ హీరో గోపీచంద్‌... ఇలా ఎలా సాధ్యం?

యాక్షన్ హీరో గోపీచంద్‌ ఇటీవల రామబాణం( Rama Banam ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సినిమా విషయంలో కొందరు విమర్శలు చేసినా మరి కొందరు పాజిటివ్‌ గా స్పందించినా కూడా ఓవరాల్‌ గా సినిమా కలెక్షన్స్‌ నిరాశ పర్చాయి అంటూ స్వయంగా నిర్మాతలు పేర్కొన్నారు.

శ్రీవాస్‌ ( Sriwass)దర్శకత్వంలో రూపొందిన రామబాణం సినిమా నిరాశ పర్చినా కూడా ఆ వెంటనే గోపీచంద్‌ కొత్త సినిమాకు సిద్దం అయ్యాడు.

అనూహ్యంగా కన్నడ కొరియోగ్రాఫర్‌ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు గోపీచంద్‌ దర్శకుడిగా తీసుకు రాబోతున్నాడు.ఏ హర్ష దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.కన్నడంతో పాటు ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా ఒక మంచి కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

చాలా సంవత్సరాలుగా గోపీచంద్‌ కు సక్సెస్ లేదు.దాంతో గోపీచంద్‌ ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకోవాలని తపన పడుతున్నాడు.

Advertisement

ముందు ముందు అయినా గోపీచంద్‌ కు సక్సెస్ లు దక్కుతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆయన అదృష్టమో లేదా మరేంటో కానీ హీరోగా సక్సెస్ అవ్వకున్నా కూడా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.గోపీచంద్‌ హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

అయినా కూడా ఆయన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ముందు ముందు మరిన్ని యాక్షన్‌ సినిమాలను గోపీచంద్‌ కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌ గా మాళవిక శర్మ( Malavika Sharma ) ను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ సినిమా యొక్క పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్న నేపథ్యం లో కచ్చితంగా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గోపీచంద్‌ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు