రామ్‌ జడ్జిమెంట్‌ లో సమస్య ఉంది

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్న రామ్‌ ఆ తర్వాత రెడ్ సినిమా తో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.

ఆ తర్వాత ది వారియర్ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ ప్లాప్ అయ్యాడు.

రామ్‌ పోతినేని కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా లేదంటే మరేదైనా పద్దతిని పాటిస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అల్లు అర్జున్‌ చేయాల్సిన కథ కనుక ది వారియర్ ను రామ్‌ వెంటనే ఓకే చెప్పి చేశాడా అంటే ఔను అనే సమాధానం వస్తుంది.

హీరోగా రామ్‌ చేసిన సినిమా లు బ్యాక్ టు బ్యాక్‌ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.దాంతో ఆయన ఎంపిక చేసుకుంటున్న దర్శకులు మరియు వారు తీసుకు వస్తున్న కథల పై అనేక అనుమానాలు వస్తున్నాయి.

ది వారియర్‌ సినిమా పై ఆయన తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.కాని రామ్ కు నిరాశ ఎదురయ్యింది.

Advertisement

ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు రామ్‌ రెడీ అవుతున్నాడు.ఆ సినిమా అయినా కథ పరంగా రామ్‌ ఇమేజ్ కు మరియు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఉంటుందా అంటూ చాలా మంది చర్చిస్తున్నారు.

రామ్‌ మరియు బోయపాటి కాంబోలో సినిమా ను జనాలు ఎంత వరకు ఆధరిస్తారు అనేది ఫస్ట్‌ లుక్‌ వచ్చిన తర్వాత కాని చెప్పలేం.అఖండ సినిమా తర్వాత బోయపాటి సినిమా కనుక పీక్స్ లో అంచనాలు ఉన్నాయి.

మరి అంచనాలను ఎంత వరకు అందుకుని మరో అఖండ ను రామ్‌ కు అందిస్తాడు అనేది బోయపాటి ట్యాలెంట్‌ పై ఆదారపడి ఉంటుంది. వీరి కాంబో లో ఆ సినిమా ను త్వరలో పట్టాలెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు