యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో యాక్షన్ మూవీస్ ను లైన్లో పెడుతూ వాటిని పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమాలతో మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడు.
మరి రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో స్కంద ( Skanda )ఒకటి.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్ట్ చేస్తుండగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
రామ్ సరసన అంతకంటే ఎనర్జీతో మెప్పించే శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తుండడంతో అందరి కళ్ళు ఈ జంట మీద ఉన్నాయి.ఈ ఎనర్జిటిక్ జంటను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.సెప్టెంబర్ లో రిలీజ్ చేయనుండగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ కూడా రాబోతుంది.
ఈ రోజు సాయంత్రం 6 గంటల 21 నిముషాలకు ఈ సాంగ్ లిరికల్ వీడియో ప్రోమో రిలీజ్ చేయనున్నారు.పూర్తి సాంగ్ ను ఆగస్టు 18న సాయంత్రం 5 గంటల 49 నిముషాలకు రిలీజ్ కానుంది.
గందరబాయి అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఎనర్జిటిక్ డాన్స్ తో ఉండబోతుంది అని పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
మరి ఈ సాంగ్ ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy