RAPO20 : రొమాంటిక్ సన్నివేశాలపై ఫోకస్ పెట్టిన బోయపాటి.. కారణం అదేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయికగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ RAPO20.

భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యింది.

రామ్ పోతినేని తో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కించారు.ఇక తాజాగా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల మీద అలాగే మిగిలిన తారాగణం మీద ఫ్యామిలీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.అంతేకాదు హీరో హీరోయిన్లపై ఇంటిమేట్ సన్నివేశాలకు బోయపాటి పెద్ద పీట వేస్తున్నారట.

అసలైతే బోయపాటి ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటారు.

Ram Pothineni Boyapatis Rapo20 Update
Advertisement
Ram Pothineni Boyapatis Rapo20 Update-RAPO20 : రొమాంటిక్ స�

కానీ ఈసారి పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా తెరకెక్కుతుండడంతో బోయపాటి కొన్ని నిబంధనలు పక్కన పెట్టి రొమాంటిక్ సన్నివేశాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.మరి పాన్ ఇండియా మూవీ కావడంతో అందరికి కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్.ఇక ఈ సినిమాలో రామ్ ని బోయపాటి సరికొత్తగా మాస్ యాంగిల్ కనిపించినా అందులో బోయపాటి మార్క్ తప్పనిసరిగా ఉంటుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Ram Pothineni Boyapatis Rapo20 Update

ఇక ప్రజెంట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత టీమ్ విదేశాలకు బయల్దేరనున్నారని సమాచారం.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక రామ్ గత సినిమా వారియర్ తో ప్లాప్ అందుకోవడంతో రామ్ బోయపాటి అయిన హిట్ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

ఇక బోయపాటి అఖండ వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు