ది వారియర్‌ కు ఇంకాస్త బజ్ కావాలి.. ఇలా అయితే కష్టం

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం ది వారియర్‌.

తమిళ మాస్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్‌ సినిమా ఈ వారం లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ది వారియర్ సినిమాకు మంచి బిజినెస్ అయ్యింది.సినిమా ను మొదట అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్‌ పెట్టి నిర్మించారనే వార్తలు వచ్చాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ది వారియర్‌ సినిమాను ఏకంగా రూ.70 కోట్ల నుండి 80 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నిర్మించారనే వార్తలు వస్తున్నాయి.అందుకు తగ్గట్లుగానే సినిమా బిజినెస్ కూడా చేసిందట.

థియేట్రికల్‌ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా పెట్టుబడి వెనక్కు వచ్చేసిందట.అయితే సినిమా కు వసూళ్లు ఎంత వరకు వస్తాయి అనే విషయం లో మాత్రం స్పష్టత కరువయ్యింది.

ఎందుకంటే సినిమా ను బడ్జెట్‌ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయినంత రేంజ్ లో మాత్రం ప్రమోషన్ చేయడం లేదు.ఈ సినిమా ను ఓ రేంజ్ లో ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది.కాని అలా జరగడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం.

Advertisement

సినిమా ను కొనుగోలు చేసిన వారు ఇప్పటి వరకు ప్రమోషన్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారట.జనాల్లోకి చాలా ఇంప్రెసివ్ గా తీసుకు వెళ్లడానికి కొత్త మార్గాలను చూపడటం లేదు అంటున్నారు.

మొత్తానికి ది వారియర్ సినిమా ప్రమోషన్ విషయంలో ఈ మూడు నాలుగు రోజుల్లో అయినా యూనిట్‌ సభ్యులు యాక్టివ్‌ గా ఉంటారా అనేది చూడాలి.కృతి శెట్టి ని ముందు పెట్టి ఇంకా మంచి ప్రమోషన్ చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు