చరణ్‌ భలే భలే చిత్రం..!

‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో దర్శకుడు మారుతి ఒక్కసారిగా స్టార్‌ దర్శకుడు అయ్యాడు.

ఈయన తనపై ఉన్న బూతు చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్‌ను ఆ సినిమాతో పోగొట్టుకున్నాడు.

ప్రస్తుతం మారుతి టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు.ఈయన దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ‘బాబు బంగారం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా తర్వాత తాను మెగా హీరోతో సినిమా చేయబోతున్నాను అంటూ ఆ మధ్య మారుతి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చరణ్‌తో మారుతి సినిమా చేసే అవకాశాలున్నాయి.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌లో చరణ్‌ నటించబోతున్నాడు.

Advertisement

ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఎన్టీఆర్‌, కొరటాల శివ సినిమా పూర్తి అయిన తర్వాత చరణ్‌, కొరటాల శివ సినిమా ప్రారంభం అవ్వనుంది.

ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందనే సమాచారం ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.మరో వైపు మారుతి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కే అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Advertisement