ఆర్ఆర్ఆర్ వాళ్ళకి కనిపించలేదా అంటూ ఫైర్ అవుతున్న జనాలు..?

దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తం గా వ్యాపించింది.

ఇక ఈ సినిమా ఎన్నో ఇంటర్నేషల్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.అంతే కాదు ఏకంగా ఆస్కార్ అందుకొని భారతీయ సినిమా స్థాయిని పెంచింది.అయితే ఆస్కార్ విజేతగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఈ సినిమా కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మాత్రం నిరాశే ఎదురైంది.

ఈ సినిమా ను కాదని కెన్నెడీ చిత్రం( Kennedy Movie ) ప్రదర్శించబడుతుంది .బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సన్నీ లియోన్ ప్రధాన పాత్ర లో నటించింది.ఇది మాత్రమే కాకుండా కొన్ని భారతీయ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు.

అయితే ఆర్ఆర ఆర్ కి ఈ అవకాశం దక్కడపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నేడు ప్రారంభం అయింది .శనివారం వరకు ఇది కొనసాగుతుంది.ఫ్రాన్స్ లోని కాన్స్ పట్టణంలో ఈ పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుతారు.

సినిమాను ఒక పండగలా జరుపుకోవడమే ఈ వేడుక ప్రత్యేకత.ప్రపంచంలోని ఉత్తమ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నిషన్స్ ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సంబరాలు చేసుకోవడం ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ యొక్క విశిష్టత అని చెప్పాలి.

ఎప్పటిలాగానే ఈ సారి కూడా ఈ ఈవెంట్ కి ఇండియన్ తారలు తమ అందాలతో సందడి చేయనున్నారు.ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లారు .

ప్రసిద్ధ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సంవత్సరం మొదటిసారిగా రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేస్తుంది.ఇంకా సారా అలీఖాన్, మానుషీ చిల్లర్ వంటి భామలు అక్కడ సందడి చేయనున్నారు.కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్జర్ డాలీ సింగ్ కూడా తొలిసారిగా రెడ్ కార్పెట్ పై దర్శనమివ్వనుంది.

ఇన్స్‌టాగ్రామ్ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చిత్రం కెన్నెడీ కాన్స్ ఫెస్టివల్‌కు సెలెక్ట్ అయినందున ఆయన కూడా హాజరవుతారని తెలుస్తోంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

భారత చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణతో భవిష్యత్తులో మన దర్శకులు తమ టాలెంట్‌ను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు మంచి అవకాశం అని చెప్పొచ్చు.

తాజా వార్తలు