ఛత్రపతిగా చరణ్ లుక్.. కేక అంటోన్న ఫ్యాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో మగధీర, రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ హీరో, చివరగా వినయ విధేయ రామ అనే అట్టర్ ఫ్లాప్ మూవీలో కనిపించాడు.

ఇక ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నా, ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు.దీంతో చరణ్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.

కాగా చరణ్‌ను పలు రకాల పాత్రల్లో తమ అభిమానులు ఊహించుకుంటున్నారు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న చరణ్, మరో పాత్ర చేస్తే ఆయనకు తిరుగే ఉండదని వారు అంటున్నారు.

అదే మరాఠా వీర మహారాజ్ ఛత్రపతి శివాజీ పాత్ర.ఈ పాత్ర గనక చరణ్‌కు పడితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్‌గా చరణ్ సరిపోతాడని మెగా ఫ్యాన్స్‌తో పాటు చాలా మంది భావిస్తున్నారు.

Advertisement

గాంభీర్యానికి, వీరత్వానికి, ఆవేశానికి ప్రతీకగా కనిపించే శివాజీ మహారాజ్ పాత్రలో చరణ్ ఒదిగిపోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.కాగా ఆయన ఇప్పటికైతే ఆ పాత్రను చేయలేదు గానీ, సోషల్ మీడియాలో శివాజీ మహారాజ్ వేషంలో చరణ్ ప్రత్యక్షమయ్యాడు.

చరణ్ అభిమాని ఒకరు ఈ మేరకు చరణ్‌ను శివాజీ మహారాజ్ గెటప్‌లో స్కెచ్ వేశాడు.ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

ఈ పాత్రలో చరణ్ నటించాలని ఆయన అభిమానుల నుండి ఎక్కువ రిక్వెస్టులు కూడా వస్తున్నాయి.మరి భవిష్యత్తులోనైనా శివాజీ లాంటీ వీరుడి పాత్రలో చరణ్ కనిపిస్తాడేమో చూడాలి.

ఏదేమైనా చరణ్‌ను శివాజీ మహారాజ్ వేషంలో మీరూ ఓసారి చూసేయండి.

ఈ ప్రముఖ టాలీవుడ్ నటి ఇద్దరు కూతుళ్లు డాక్టర్లే.. ఎంతో అదృష్టవంతురాలు అంటూ?
Advertisement

తాజా వార్తలు