ఆ ట్యాగ్ పై సంతృప్తిగా లేని రామ్‌ చరణ్.. అందుకే దిల్ రాజు తొలగించాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్( Shankar ) దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా టైటిల్ రిలీజ్ చేస్తూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది.

ఈ మధ్య కాలం లో రామ్ చరణ్ ని అభిమానులు గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దిల్ రాజు కూడా ఈ సినిమా లో రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) అని టైటిల్ కార్డు వేయించాలని భావించారు.

కానీ రాంచరణ్ ఆ విషయం లో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.తనకు ఆ ట్యాగ్ అవసరం లేదని చిత్ర యూనిట్ సభ్యులతో రామ్ చరణ్ చెప్పాడట.

అందుకే టీజర్ లో గ్లోబల్ స్టార్( global star ) అనే ట్యాగ్ ని తొలగించారని సమాచారం అందుతుంది.

Advertisement

మొత్తానికి రామ్ చరణ్ సింప్లీసిటీ కి ఇది నిదర్శనం అనేది మరి కొందరి వాదన.మెగా ఫాన్స్ మాత్రం ఈ విషయం లో తగ్గేది లేదంటున్నారు.గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్‌ తోనే రాంచరణ్ పిలుచుకుంటామంటున్నారు.

మెగా పవర్ స్టార్ కంటే గ్లోబల్ స్టార్ అంటేనే ఎక్కువ వెయిట్ ఉంటుంది.కనుక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ఇక నుండి పిలుస్తామంటున్నారు.

రాంచరణ్ త్వరలో హాలీవుడ్ సినిమా( Hollywood movie ) చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.అందువల్ల కూడా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ రాంచరణ్ కి సరిగ్గా సూట్ అవుతుందని అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే రామ్ చరణ్ త్వరలోనే హిందీ మరియు ఇంగ్లీష్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉందని అభిమానులు శక్తిగా ఎదురు చూస్తున్నారు.నేడు రాంచరణ్ బర్త్ డే సందర్భం గా ఫ్యాన్స్ ఇద్దరు సందడి చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

హ్యాపీ బర్త్ డే రాంచరణ్.

Advertisement

తాజా వార్తలు