ఆర్ఆర్ఆర్‌లో పోలీస్‌గా చరణ్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో చరణ్ కొంతసేపు పోలీస్ అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తోంది.దీంతో చరణ్ పోలీస్‌గా ఎందుకు మారాడనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టే సీతారామరాజు ఓ సందర్భంలో వారి కళ్లు గప్పేందుకు పోలీస్ అవతారమెత్తుతాడు.దీనికోసమే చరణ్ పోలీస్ పాత్రలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

Advertisement

తారక్ కూడా సరికొత్త లుక్‌లో కొమురం భీం పాత్రలో ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు నటిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు