ఆర్ఆర్ఆర్‌లో ఐటెం వేశాలు వేస్తోన్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు హీరోలు సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

Rakul Preet Singh To Do Item Song In RRR, Rakul Preet Singh, RRR, Rajamouli, Ram

వీరి పాత్రలకు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ప్లాన్ చేశాడట దర్శకుడు రాజమౌళి.

ఈ ఐటెం సాంగ్‌లో ఎవరిని తీసుకుందామా అని రాజమౌళి ఆలోచిస్తుండగా, రామ్ చరణ్ ఓ బ్యూటీ పేరును రికమెండ్ చేశాడట.టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ పేరును చరణ్ రికమెండ్ చేశాడు.

Advertisement

కాగా చరణ్‌తో రకుల్ రెండు సినిమాలు చేయడంతో ఆమెను తీసుకునేందుకు జక్కన్న ఈ ఐటెం సాంగ్‌లో తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స‌మ్మ‌ర్ లో బాడీ హీట్‌ను మాయం చేస్తే సూప‌ర్ డ్రింక్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు