తొలి వన్డేను వీక్షిస్తున్న రజనీకాంత్.. ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్..!

ఆస్ట్రేలియా- భారత్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూసి అవాక్కయ్యారు.

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ), ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోటోలు వైరల్ అవడంతో, ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ఇక టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంటే, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోసం బరిలోకి దిగింది.

భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 188 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఒకపక్క భారీ స్కోరు ఇస్తూ.

మరొకపక్క తొందరగా వికెట్లు తీస్తూ భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు తట్టుకోలేక వెనుతిరిగారు.

Advertisement

ఇక మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ), షమీ చెరో మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు.ఆసీస్ బ్యాటింగ్ కు వస్తే మిచెల్ మార్ష్ (81) పరుగులు చేశాడు.మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేదు.

సరైన సమయంలో భారత బౌలర్లు కీలకమైన వికెట్లను తీయడంతో ఆస్ట్రేలియా ఎక్కువ స్కోరు నమోదు చేయలేకపోయింది.

189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అతి దారుణంగా బ్యాటింగ్ చేస్తూ ఓటమి దిశగా సాగుతోంది అని చెప్పాలి.7 ఓవర్లకు మూడు కీలక వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్ కిషన్ మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 9 బంతులకు( Virat Kohli ) నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.తర్వాత బరిలోకి దిగిన సూర్య కుమార్ యాదవ్ మొదటి బంతికే వెనుతిరగడంతో భారత్ ఇప్పటికే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు