ఈ యంగ్ డైరెక్టర్ అయినా రజనీ కోరిక నెరవేర్చేనా?

సౌత్ టాప్ హీరో రజనీ కాంత్.ఈయన ఎప్పుడో పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

రోబో లాంటి సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు బద్దులు కొట్టాడు.తాజాగా సౌత్ నుంచి పలువురు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలు తీస్తూ దుమ్ము రేపుతున్నారు.

ఈ నేపథ్యంలో తను కూడా ఓ పాన్ ఇండియన్ రేంజి సినిమా చేయాలని భావిస్తున్నాడు.అందులో భాగంగానే పలువురు యంగ్ డైరెక్టర్లను ఏరి కోరి అవకాశాలను ఇస్తున్నాడు.

అయితే ఆయా దర్శకులు.తమ పై రజనీ పెట్టికున్న ఆశలను ఫుల్ ఫిల్ చేయడంలో సక్సెస్ కాలేక పోతున్నారు.

Advertisement
Rajinikanth Experiments With Young Director , Nelson Dilip Kumar, South Top Hero

ఫిజ్జా సినిమాతో దర్శకుడిగా మారాడు కార్తీక్ సుబ్బరాజ్.ఆయన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.ఆయన తెరకెక్కించిన జిగర్తాండ సినిమా చూసి.

తన సినిమా పేటకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు రజనీ.అయితే బాక్సాఫీస్ ముందు మంచి హిట్ ఇవ్వలేక పోయాడు సుబ్బరాజ్.

ఆ తర్వాత మురగదాస్ తో దర్భార్ సినిమా చేశాడు.ఈ సినిమా అయినా మంచి హిట్ ఇస్తుంది అనుకుంటే అది కూడా డిజాస్టర్ అయ్యింది.

భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరున్న కోలీవుడ్ దర్శకుడు శివకు అన్నాత్తే సినిమా అవకాశం చ్చాడు.ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

తెలుగులో పెద్దన్నగా డబ్బై విడుదలైనా జనాలు అంతగా ఆదరించలేదు.

Rajinikanth Experiments With Young Director , Nelson Dilip Kumar, South Top Hero
Advertisement

ప్రస్తుతం రజనీ కన్ను నెల్సన్ దిలీప్ కుమార్ మీద పడింది.తమిళ పరిశ్రమలో 2018లో కొలనువ్వా కోకిల సినిమాతో దర్శకుడిగా అడుగు పెట్టాడు నెల్సన్.తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

బెస్ట్ స్క్రీన్ ప్లే తో పాటు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులను అందుకున్నాడు.అనంతరం శివ కార్తికేయన్ తో కలిసి వరుణ్ డాక్టర్ సినిమా చేశాడు.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ తో కలిసి బీస్ట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.తాజాగా రజనీ తన తదుపరి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని నెల్సన్ కు ఇచ్చాడు.

ఈ దర్శకుడు అయినా సూపర్ స్టార్ కు సాలిడ్ హిట్ ఇస్తాడో? లేదో? వేచి చూడాలి.

తాజా వార్తలు