Rajini Kanth : పాపం రజినీ.. ప్రేక్షకులు అసలు దేకడం లేదు..అట్టర్ ఫ్లాప్

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం "జైలర్"( Jailer ).

సూపర్ స్టార్ రజిని కాంత్( Rajini Kanth ) హీరో గా, తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లకు ప్రేక్షకులను రప్పించడంలో విజయం సాధించింది, కానీ టీవీల ముందు కూర్చోపెట్టలేకపోయింది.

అవును.మీరు విన్నది నిజమే.

సుమారు 600 కోట్ల రూపాయల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టిన ఈ చిత్రం, బుల్లితెర పై తన ప్రతాపాన్ని చూపించలేకపోయింది.వెండి తెర పై పులిలా గర్జించిన చిత్రం, బుల్లితెర పైకి వచ్చేసరికి పిల్లి అయిపొయింది.

జైలర్ చిత్రం సాటిలైట్ రైట్స్ సన్ టీవీ( Sun TV ) సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే.సొంతం చేసుకోవడం ఏమిటి? సినిమా నిర్మించినదే సన్ టీవీ అధినేత కళానిధి మారన్( Kalanidhi Maran ).ఈ చిత్రం తాజాగా బుల్లితెర పై ప్రసారమైంది.ఐతే అందరి ఊహలను తారుమారు చేస్తూ, ఈ చిత్రం టి ఆర్ పి రేటింగ్ లో అట్టడుగున నిలిచింది.బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం సాధించిన రేటింగ్ కేవలం 5.40 మాత్రమే.దీనికి ముఖ్య కారణం ఈ సినిమా సన్ టీవీ లో ప్రసారం కావడమే.

Advertisement

సన్ టీవీకి ప్రేక్షకాదరణ తగ్గింది అన్నది జగమెరిగిన సత్యం.తమిళనాట ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారేమో గాని, తెలుగు రాష్ట్రాలలో ఈ ఛానెల్స్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎన్నెన్నో ప్రణాళికలు వేశారు దర్శకనిర్మాతలు.అప్పట్లో నరసింహ సినిమాలో సూపర్ హిట్ పెయిర్ గా నిలిచినా రజినీకాంత్, రమ్య కృష్ణ కాంబో ను మళ్ళీ ఈ చిత్రంలో ఒకటి చేసారు.కానీ ఈ చిత్రంలో రమ్య కృష్ణ( Ramya Krishna ) పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు.

సినిమా అంతా రజిని చుట్టే తిరుగుతూ ఉంటుంది.ఆమె మాత్రమే కాకుండా కన్నడ, మలయాళీ సూపర్ స్టార్ లు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ను కూడా ఈ చిత్రంలో వాడేశారు.

కానీ వారి పాత్రల నిడివి కూడా తక్కువే.ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిన విభాగం సంగీతం.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈ చిత్రానికి రెండో హీరో అనిరుద్ అని చెప్పాలి.అతడి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు తోడవ్వకపోయిఉంటే, ఈ చిత్రం ఇంతటి విజయాన్ని సాధించి ఉండేది కాదు.

Advertisement

అసలు విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచినా అంశాలన్నీ కేవలం థియేటర్ లో చూసేందుకు మాత్రమే బాగుంటాయి.ఎలేవేషన్ సీన్లు, సంగీతం, రజిని కాంత్ స్టైల్.

ఇలా అన్ని థియేటర్ లో వర్క్ అవుట్ అయినట్టు టీవీ లో వర్క్ అవుట్ అవ్వవు.అందుకే ఈ చిత్రం బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

తాజా వార్తలు