నా కూతురు లేచి పోయి లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంది.. ఆమెతో మాట్లాడటం లేదు

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా చాలా సరదాగా మాట్లాడతాడు.అందరిని నవ్విస్తూ కార్యక్రమంకు హుషారు జోడిస్తాడు.

కాని ఈసారి మాత్రం రాజేంద్ర ప్రసాద్‌ అందరికి షాకిస్తూ మాట్లాడటం జరిగింది.ఎప్పటి నుండో తన మనస్సులో ఉన్న బాధను తాజాగా బేవర్స్‌ అనే చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సందర్బంగా చెప్పుకొచ్చాడు.

తన ఫ్యామిలీ విషయాలను ఈ కార్యక్రమంలో షేర్‌ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్‌ అందరిని ఆకర్షించాడు.

రాజేంద్ర ప్రసాద్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.తల్లి లేని వారు వారి కూతురులో తల్లిని చూసుకుంటారు.నాకు 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు నా తల్లి చనిపోయిందన్నారు.

Advertisement

దాంతో నా ఒక్కగానొక్క కూతురులోనే నా తల్లిని చూసుకున్నాను.నా తల్లిలా కూతురు గాయత్రిని కాపాడుకుంటూ వచ్చాను.

కాని నా కూతురు ప్రేమ వివాహం చేసుకుని నాకు దూరంగా వెళ్లి పోయింది.పెళ్లి తర్వాత నేను కూడా ఆమెను దూరంగా ఉంచాను.

నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదనే కోపంతో ఆమెను దూరంగా ఉంచాను.కాని తాజాగా నేను నటించిన బేవర్స్‌ చిత్రం కోసం సుద్దాల అశోక్‌ తేజ రాసిన పాట నాలో మార్పును తీసుకు వచ్చింది.

ఆ పాట విన్న తర్వాత నా కూతురును ఇంటికి పిలిపించాను.ఆమెకు ఈ పాటను నాలుగు అయిదు సార్లు వినిపించాను అంటూ చెప్పుకొచ్చాడు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

అద్బుతమైన పాట అంటూ రాజేంద్ర ప్రసాద్‌ అన్నాడు.

Advertisement

మొత్తానికి సుద్దాల అశోక్‌ తేజ రాసిన తల్లి తల్లి చిట్టి తల్లీ.నా ప్రాణాలే పోయాయి అనే పాట రాజేంద్ర ప్రసాద్‌ను ఆయన కూతురును ఒక్కటి చేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు.