చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల రాజీవ్ కనకాల సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు అరెస్ట్ అయ్యే దాదాపు నెల రోజులు కావస్తుంది.

మరోపక్క న్యాయస్థానాలలో పోరాడుతున్న గాని బెయిల్ దొరకడం లేదు.ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు నందమూరి కుటుంబ సభ్యులు( Nandamuri family members ) స్పందించడం జరిగింది.

Rajeev Kanakala Sensational Comments On NTR Non Response On Chandrababu Arrest ,

చంద్రబాబు అరెస్టు ని ఖండించారు.అయితే నందమూరి కుటుంబ సభ్యులలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల బాలకృష్ణ .బ్రో ఐ డోంట్ కేర్ అని కూడా కామెంట్లు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్( NTR ) స్నేహితుడు సినీ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ విషయంపై స్పందించారు.

Advertisement

సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో తారక్ స్పందించక పోయి ఉంటాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కరోనా తర్వాత RRR తప్ప.మరో సినిమా రాకపోవడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న "దేవర" సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి చంద్రబాబు అరెస్టు విషయంపై స్పందించకపోయి ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తెలియజేయడం జరిగింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్టీఆర్ చాలా సమయం కేటాయించడం జరిగింది.ఆ సమయంలో మూడ్నాలుగు సినిమాలు చేసి ఉండేవాడు.

పైగా ప్రస్తుతం చేస్తున్న "దేవర" రెండు భాగాలుగా వస్తోందంటున్నారు.ఈ కారణంగానే తారక్ తన దృష్టంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు.

అందుకే రాజకీయాలపై స్పందించలేదని భావిస్తున్నా అని రాజీవ్ తెలియజేశారు.

మే 26న ఆకాశంలో కనువిందు చేయనున్న సూపర్ బ్లడ్ మూన్..!
Advertisement

తాజా వార్తలు