అభిమానులను నిరాశ పరిచిన రాజాసాబ్...ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.

ప్రస్తుతం రాజమౌళి తన దైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఆయన ప్రభాస్ తో ఎప్పుడైతే బాహుబలి సినిమా ( Baahubali )తీశాడో అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ కూడా భారీ ఎత్తున ప్రణాళికలను రూపొందించుకుంటూ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

Rajasaab Who Disappointed The Fans...what Is Prabhas Like, The Rajasaab , Pra

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా లోని సోలు మొత్తాన్ని రంగరించి ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇది ఒక హర్రర్ నేపధ్యం లో సాగే సినిమాగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు మారుతి ప్రేమ కథ చిత్రమ్ అనే సినిమాతో హర్రర్ సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.

Rajasaab Who Disappointed The Fans...what Is Prabhas Like, The Rajasaab , Pra
Advertisement
Rajasaab Who Disappointed The Fans...what Is Prabhas Like, The Rajasaab , Pra

ఇక ఇప్పుడు తనదైన రీతిలో ఈ సినిమాని కూడా భారీ సక్సెస్ గా నిలపాడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఏది ఏమైనా కూడా మారుతి లాంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేయడమే ఎక్కువ అనుకున్న సమయంలో ఆయనకు సంభందించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసే సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేశాడు.కానీ ఆ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

ఓల్డ్ టెంప్లెట్ లో సాగుతున్న ఈ మోషన్ పోస్టర్ ( Motion poster )ఆశించిన మేరకు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది.ఇక ప్రభాస్ లక్ కూడా ఓల్డ్ గానే అనిపించింది.

Advertisement

తాజా వార్తలు