అఫిషియల్‌ : ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే!

రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమా లు డిసెంబర్‌ మొదటి వారం నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా మేము పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాము.

నిన్న మొన్న కూడా ట్రైలర్‌ ను డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది.తాము ముందు నుండి చెబుతున్నట్లుగా డిసెంబర్ మొదటి వారంలో భారీ ఎత్తున ట్రైలర్ ను విడుదల చేసేందుకు జక్కన్న టీమ్‌ ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్‌ 3వ ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అఫిషియల్‌ అనౌన్స్మెంట్ వచ్చింది.అద్బుతమైన విజువల్స్ తో మూడు నిమిషాల పాటు ఈ ట్రైలర్ ఉంటుందని మేకర్స్‌ నుండి సమాచారం అందుతోంది.

Rajamouli Rrr Movie Trailer Release Date,latest News

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లకు సంబంధించిన టీజర్ లు వచ్చాయి.పాటలో ఇద్దరు ఎలా ఉన్నారో తెలిసిపోయింది.కాని సినిమా కథ ఏంటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Advertisement
Rajamouli RRR Movie Trailer Release Date,latest News -అఫిషియల్�

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పారు కాని కథ విషయం లో మాత్రం లీక్ ఇవ్వలేదు.అందుకే ట్రైలర్ లో ఆ విషయమై ఏమైనా ఆసక్తికర విషయాన్ని జక్కన్న రివీల్‌ చేస్తాడా అనేది చూడాలి.

జక్కన్న నుండి ఇప్పటికే వచ్చిన రియాక్షన్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది.అద్బుతమైన సినిమా అంటూ అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.బాహుబలి ని మించిన వసూళ్లు ఈ సినిమా రాబట్టడం ఖాయం అని అంతా నమ్ముతున్నారు.

మరి ఆర్‌ ఆర్ ఆర్‌ ఇండియాస్ అతి పెద్ద సినిమా గా బాహుబలి ని ఢీ కొట్టి నిలిచేనా చూడాలి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు