ఆర్ఆర్ఆర్‌ కు కొత్త డెడ్ లైన్ ఫిక్స్ చేసిన జ‌క్క‌న్న‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి మొద‌టిసారి న‌టిస్తున్న చిత్రం `రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`.

ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌గా.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది అనుకున్న స‌మ‌యంలో.

Rajamouli Sets A Deadline For Rrr Movie Shooting! Rajamouli , Deadline, Rrr Movi

క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డం.లాక్‌డౌన్ విధించ‌డం.

చిత్ర‌యూనిట్ మొత్తం ఇంటికే ప‌రిమితం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.అయితే కేంద్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా షూటింగ్స్‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో.

Advertisement

మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు షూటింగ్స్‌కు రెడీ అవుతున్నాయి.ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాజ‌మౌళి మ‌రియు డీవీవీ దానయ్య షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

అదే స‌మ‌యంలో జ‌క్క‌న షూటింగ్ పూర్తి చేయ‌డానికి కూడా ఓ డెడ్ లైన్ పిక్స్ చేశార‌ట‌.వచ్చే విజ‌య‌ద‌శ‌మి తర్వాత సినిమా షూట్ మొదలు పెట్టి.

కేవలం నాలుగు నెలల లోపే సినిమాను పూర్తి చేసేయాలని జ‌క్కన్న నిర్ణ‌యించుకున్నార‌ట‌.మ‌రి షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేస్తే.

విడుద‌ల కూడా కాస్త ముందే ఉంటుంద‌ని అని చెప్పొచ్చు.కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నుండ‌గా.

ద్రాక్ష పండ్ల‌లో గింజ‌లు పారేస్తున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు.ఇక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మ‌రియు హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు