ఇంగ్లీష్ సినిమాల సీన్లు కాపికొడుతున్న రాజమౌళి?

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి .హాలివుడ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మైళ్ళ దూరంలోనే ఉంది.

మనం 2017 లో బాహుబలి బాహుబలి అని గర్వపడుతున్నాం కాని ఇలాంటి జానపద గాధలను వాళ్ళు 1990లు, 2000లనుంచే తీసుకుంటూ వచ్చారు.హ్యారీపాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, 300 .ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి.ఇక సూపర్ హీరో సినిమాల గురించి చెప్పేదేముంది.కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతూ, భారి యాక్షన్ సినిమాలు తీయాలంటే హాలివుడ్ తరువాతే ఎవరైనా.300 .ఈ సినిమా చూసిన తరువాతే మన జక్కన్న దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోని మగధీర తీసారు.దానికి దీనికి కథ విషయంలో సంబంధం లేకపోయినా, యాక్షన్ ఎపిసోడ్లు కాపి కొట్టేసారు.

బాహుబలి కథ హాలివుడ్ లో లేనిదే, యుద్ధసన్నివేశాలు కూడా కాపీ కొట్టకుండా, సొంత ఆలోచనలతో తీసారు.కాని బాహుబలి 2 కి వచ్చేసరికి మళ్ళీ పాత జక్కన్న బయటకి వచ్చేసాడు.

ట్రైలర్ లో ప్రభాస్ పైకి చూస్తుండగా బాణాల వర్షం కురిసే షాట్ హర్క్యూలెస్ అని సినిమాలోది కాగా, ప్రభాస్ పై మాహిశ్మతి జనాలంతా చేతులు వేసే షాట్ బ్యాట్ మాన్ vs సూపర్ మాన్ సినిమాలోది.బాహుబలి అంటే ఒక అంతర్జాతీయ ప్రాజక్ట్ లాంటిది.

Advertisement

హాలివుడ్ ఆడియెన్స్ కూడా దీనిపై ఓ కన్నేస్తారు.మరి ఇదంతా తెలిసిన రాజమౌళి ఈ తప్పులు ఎందుకు చేసినట్టో! .

ప్రభాస్ రాజసాబ్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందా.?

Advertisement

తాజా వార్తలు