టార్గెట్ ఏపీ అంటున్న గాంధీ కుటుంబం..!!

తెలంగాణ (Telangana) లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.అందరూ అనుకున్నట్టే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం గాంధీ కుటుంబం అని చెప్పుకోవచ్చు.రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చారు.

అయితే తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎన్నో సభలు, సమావేశాలు పెట్టి ప్రజలను మోటివేట్ చేసిన గాంధీ కుటుంబం ప్రస్తుతం ఏపీపై తమ ఫోకస్ పెట్టాలి అని చూస్తున్నారట.ఇక మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూడా ఎన్నికలు రాబోతున్నాయి.

Advertisement

ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు అయిన వైసిపి, టిడిపి మధ్య గట్టి పోటీ ఉంటుంది.ఇప్పటికే టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకుంది.

అలాగే బిజెపితో కూడా పొత్తు పెట్టుకోవాలని చూసినప్పటికీ అది కుదరడం లేదు.

ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి (TDP) పొత్తు పెట్టుకుంది.అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం( YCP ) ఏర్పడకుండా అడ్డుకట్ట వేయలేకపోయింది.అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో( AP Elections ) గట్టి పోటి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట.

ఇక తెలంగాణ ఎన్నికల్లో అన్ని తామే అయ్యి ముందుండి నడిపించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏపీ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారట.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

ఇక త్వరలోనే ఏపీలో కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఏపీపై పట్టు సాధించాలని, ఏపీ ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ తీసుకురావాలని కాంగ్రెస్ (Congress) అధిష్టానం భావిస్తుందట.తెలంగాణలో ఎలా అయితే తమ ప్రచారాలతో హోరెత్తించి కాంగ్రెస్ వైపు ప్రజలందరూ మళ్లేలా చేశారో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలి అని భావిస్తున్నారట.మరి చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఈ గాంధీ కుటుంబం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తుందో.

Advertisement

తాజా వార్తలు