అలాగైతే రాజుగారు ఉప ఎన్నిక‌కు వెళ్ల‌వ‌చ్చు క‌దా..! స‌వాళ్లు విసురుతున్న వైసీపీ నేత‌లు...!!

న‌ర‌సాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఓ యాప్ ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే స‌ర్వే నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

ఈ స‌ర్వేలో దాదాపు టీడీపీకే 90 కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలో వెల్ల‌డైంద‌ని చెప్పుకొచ్చారు.

ఇక త‌మ పార్టీ అంటే వైసీపీకి మహా అయితే 10 నుండి 15 అసెంబ్లీ సీట్లు వస్తే ఎక్కువని చెప్పారు.సొంతంగా పోటీ చేస్తే టీడీపీ గెలుపు ఖాయమన్నారు.

అదే టీడీపీ జనసేన పొత్తుపెట్టుకుంటే రాష్ట్రం మొత్తాన్ని స్వీప్ చేసేయటం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు.అంతే కాకుండా టీడీపీ గెలవబోయే నియోజకవర్గాల్లో కొన్నింటిని చదివి మరీ వినిపించారు.

ప్రత్యేక యాప్ ద్వారా ఎంపీ చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలు వాస్త‌వ‌మ‌ని ప‌దే ప‌దే చెప్పారు.

రాజీనామా చేయ్.!

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఇప్పుడు రాజుగారికి వైసీపీ నేత‌లు స‌వాళ్లు విసురుతున్నారు.

Advertisement
Raghurama Krishnam Raju Can Go For The By-election YCP Leaders Challenges Detail

త‌ను చేయించిన సర్వే అంత అస‌లు సిస‌లైన స‌ర్వే అయితే వెంటనే తాను ఎంపీగా రాజీనామా చేసేయచ్చుకదా.ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేన తరఫున పోటీ చేసి గెలవచ్చుకదా అని సెటైర్లు వేస్తున్నారు.

తాను చేయించుకున్న సర్వేలో నరసాపురం ఎమ్మెల్యే సీటులో టీడీపీకే గెలుపు అవకాశాలున్నట్లు చెప్పారు.

Raghurama Krishnam Raju Can Go For The By-election Ycp Leaders Challenges Detail

పైగా ఎంపీ అంచనా ప్రకారం టీడీపీ జనసేనకు 160 సీట్లు ఖాయమని తేలింది.మ‌రి ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో నెగ్గితే త‌ను చేయించిన స‌ర్వేనే నిజ‌మ‌ని న‌మ్ముతారు క‌దా.అంటున్నారు.

అయితే మొత్తం సీట్ల‌లో 160 అసెంబ్లీ సీట్లలో టీడీపీ జనసేన గెలుపు ఖాయమన్న తర్వాత ఎంపీ సీట్లలో మొత్తం 25కి 25 ఈ పార్టీలే గెలుచుకునే అవకాశాలున్నాయి.అంటే ప్రతిపక్షాలు గెలుచుకోవటం ఖాయమన్న ఎంపీ సీట్లలో నరసాపురం కూడా ఉందనే కదా అర్ధం.

Raghurama Krishnam Raju Can Go For The By-election Ycp Leaders Challenges Detail
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

గెలుపు అంత స్పష్టంగా తెలుస్తున్నపుడు ఎంపీగా రాజీనామా చేయటానికి ఎందుకు రఘురాజు వెనకాడుతున్నారు.? రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చి మళ్లీ గెలిస్తే తిరుగుబాటు ఎంపీ సర్వే నిజమే అని జనాలు నమ్మే అవకాశం ఉంది క‌దా అంటున్నారు.పైగా ఎంపీ రాజీనామా చేసి మ‌ళ్లీ గెలిస్తే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంద‌ని.

Advertisement

త‌ను చెప్పిన స‌ర్వే నిజ‌మ‌ని జ‌నాలు న‌మ్ముతారు క‌దా అంటున్నారు.మ‌రి రాజుగారు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు