కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... బీఆర్ఎస్ లోకి రఘునందన్ ?

గత కొద్ది నెలలుగా పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అసంతృప్తులతో సతమతమవుతున్న తెలంగాణ బిజెపి లో  రోజుకో కొత్త నేత తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగకుతూ, పార్టీ వ్యవహారాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay Kuma ) తీరుపై అనేకమంది పరోక్షంగా ఇప్పటి వరకు విమర్శలు చేసినా, దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బహిరంగంగానే విమర్శలు చేయడం, ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు చేయడం, తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ పైనా కామెంట్ చేయడం వంటివి వైరల్ అయ్యాయి.

అయితే ఈ విషయాలపై రఘునందన్ రావు స్పందించి, తాను అనని మాటలు కూడా అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోందని ఖండించారు.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అయితే రఘునందన్ రావు ఇంత ఆకస్మాత్తుగా బండి సంజయ్ పైన, కేంద్ర బిజెపి పెద్దల నిర్ణయాల పైన ఫైర్ అవడానికి కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

Raghunandan Rao Ready To Join In Brsbjp, Ragunandan Rao, Telangana Bjp, Brs P

కొద్దిరోజుల క్రితమే రఘునందన్ రావు ఢిల్లీకి వెళ్లి వచ్చారు.ఆ తర్వాత సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఈ విధంగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా రఘునందన్ రావు వ్యవహరించేవారు.

Advertisement
Raghunandan Rao Ready To Join In BRS?bjp, Ragunandan Rao, Telangana Bjp, Brs P

పదేళ్ల క్రితం ఆయన బిజెపిలో చేరారు.కొద్ది కాలంలోనే ఆ పార్టీలో కీలక నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు.

మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి రఘునందన్ రావు లో మార్పు వచ్చిందని, ఆయన బిజెపిని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Raghunandan Rao Ready To Join In Brsbjp, Ragunandan Rao, Telangana Bjp, Brs P

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనూ ఆ పార్టీలోని కీలక నేతలు అందరిపైన విమర్శలు చేసిన రఘునందన్ రావు తన గురువైన కెసిఆర్ పై మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు.ప్రస్తుతం బిజెపిలో నెలకొన్న పరిణామాలతో రఘునందన్ రావు బీఆర్ఎస్ లో చేరాలనే ఆలోచనతో ఉన్నారట.అయితే బిఆర్ఎస్ మంత్రి ఒకరు రఘునందన్ రావు చేరికను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట.

స్వయంగా కేసీఆర్ కలుగ చేసుకుంటే ఎవరు ఆపలేరు.దీంతో తనను చేరాల్సిందిగా బీ ఆర్ఎస్ నుంచి పిలుపు వస్తుందని, కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తారని రఘునందన్ రావు ఎదురుచూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అంతేకాదు రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున మెదక్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం కూడా అప్పుడే మొదలైపోయింది..

Advertisement

తాజా వార్తలు