ఫ్యాన్స్‌ మద్య పోటీ.. లక్షలు ఖర్చు చేస్తున్న అభిమాన సంఘాలు

తమిళనాట అభిమానులు తమ అభిమాన నటులను ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా రజినీకాంత్‌, విజయ్‌, అజిత్‌ల ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వార్‌ చేసుకుంటూ ఉంటారు.

ఇక ఆమద్య తమిళనాడులో ఒకే రోజు ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు విడుదలైన కారణంగా ఏకంగా రక్త పాతం జరిగిన విషయం కూడా తెల్సిందే.ఎంతో మంది అభిమానులు తమ అభిమాన హీరోపై ఉన్న అభిమానంతో ఇతరులపై దాడులు చేయడం కూడా చూశాం.

ఇక తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అభిమాన సంఘాల వారు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ కటౌట్స్‌ నిర్మించడం కూడా మనం ఇప్పటి వరకు చూశాం.

తమిళనాడులో అత్యధికంగా విజయ్‌ మరియు అజిత్‌లకు కటౌట్స్‌ కడుతూ ఉంటారు.లక్షలు ఖర్చు చేసి ఇప్పటి వరకు కటౌట్స్‌ ఏర్పాటు చేశారు.అయితే ఇప్పటి వరకు విజయ్‌, రజినీకాంత్‌, అజిత్‌ల ఫ్యాన్స్‌ మాత్రమే భారీ కటౌట్లు కడుతూ వచ్చారు.

Advertisement

ఈసారి సూర్య అభిమానులు కూడా ఆ పని చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచరం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య హీరోగా రూపొందిన ఎన్జీకే చిత్రం విడుదల సందర్బంగా ఆయన అభిమానులు దేశంలోనే అతి పెద్దదైన కటౌట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

210 అడుగుల కటౌట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ కటౌట్‌ కోసం అభిమాన సంఘం వరకు దాదాపుగా ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.ఇది అధికారికంగా మాత్రమే, అనధికారికంగా మరింత ఎక్కువగా కూడా ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సూర్య కటౌట్‌తో ఆయన ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో స్థాయిని పెంచబోతున్నారు.ఇప్పటి వరకు సూర్య అభిమానులు కాస్త సైలెంట్‌ అంటూ అంతా అనుకున్నారు.కాని ఇకపై సూర్య అభిమానులు దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈనెల 31న తమిళంతో పాటు తెలుగులో కూడా కేజీఎఫ్‌ రాబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు