పీపుల్స్ స్టార్‌ ఇంకా సినిమాలు చేస్తున్నాడా.. పేపర్‌ లీకేజ్ పై ఏదో చేస్తున్నాడు

ప్రస్తుత ప్రేక్షకులకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి( R.Narayanamurthy ) గురించి పెద్దగా తెలియక పోవచ్చు.

కానీ ప్రస్తుతం మూడు పదుల వయసు నాలుగు పదుల వయసు ఉన్న ప్రేక్షకులకు ఆర్.నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.ఒక అద్భుతమైన ఉద్యమ చిత్రకారుడు ఆర్ నారాయణ మూర్తి కమర్షియల్ సినిమాలు తెరకెక్కిస్తే వందల కోట్ల కలెక్షన్స్ దక్కించుకునే స్థాయి ఉన్న ఆయన రోడ్లపై నడుచుకుంటూ తిరుగుతూ ఇప్పటికీ ఆటోలో దూర ప్రాంతాలకు వెళ్తూ సినిమాలు గురించి ప్రచారం చేస్తూ సినిమా వాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాడు.

గత కొంత కాలంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్.నారాయణమూర్తి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో అన్ని తానే చేసే ఆర్ నారాయణ మూర్తి ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు దూరమైనట్లుగా కనిపిస్తున్నారు.

సినిమా కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన సినిమాల మేకింగ్ విషయంలో ఆసక్తి చూపించడం లేదని, ఇతర స్టార్స్ నటించిన సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ఆర్.నారాయణమూర్తి కొత్త సినిమాను చేయబోతున్నాడని ప్రకటన వచ్చింది.ఈ మధ్య కాలంలో పేపర్ లీకేజీ వ్యవహారం( Paper leakage issue ) మీడియాలో తార స్థాయికి చేరింది.

ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య చిచ్చుపెట్టే విధంగా పేపర్ లీకేజీ వ్యవహారం సాగింది.అత్యంత కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ఆర్ నారాయణ మూర్తి ఈ విషయమై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

Advertisement

ఆర్ నారాయణ మూర్తి సినిమా అంటే కచ్చితంగా ప్రభుత్వం పై వ్యతిరేకత కలిగేలా చూపిస్తాడు.ఇలాంటివి చూపించడం జరుగుతుంది.

కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana State Govt )ఈ సినిమా విషయంలో ఆర్.నారాయణమూర్తికి ఏమైనా అడ్డు తగిలే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఆర్ నారాయణ మూర్తి సినిమా మళ్లీ వస్తుంది అంటే ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మాదిరిగా ఎర్రన్న సినిమాలు ఉండడం కష్టమే అయినా కూడా ఆయన సినిమాలు రావడమే గొప్ప.వస్తే కచ్చితంగా చూస్తాము అని అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

కనుక ఎర్రన్న పేపర్ లీకేజీ పై సినిమా తీస్తే మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు