పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?

ఈరోజు నుంచి థియేటర్లలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ రీ లోడెడ్ వెర్షన్ ప్రదర్శితం అవుతోంది.

ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 40 నిమిషాలు కాగా పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది.

అయితే ఈ సినిమాలో కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఏవనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.ఇంటర్వల్ లో మంగళం శ్రీను, షెకావత్ మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం సినిమాలో ఉంది.

ఎస్పీ షెకావత్ శ్రీలంక వెళ్లే కంటైనర్ ను కనుక్కుని ఆ కంటైనర్ ద్వా జపాన్ స్మగ్లింగ్ నెట్వర్క్ కు సంబంధించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ సీన్ లో ఉన్న కన్ఫ్యూజన్ సైతం ఈ సినిమా చూసిన వాళ్లకు తొలగిపోతుంది.

పుష్ప జపాన్ ఫైట్ కు సంబంధించి రీలోడెడ్ వెర్షన్ చూసిన వాళ్లకు క్లారిటీ వస్తుంది.

Advertisement

రావు రమేష్( Rao Ramesh ) జగపతిబాబు( Jagapathi Babu ) పుష్ప పాత్రల మధ్య ఎర్రచందనం దాచిన ప్లేస్ కు సంబంధించిన చర్చ జరుగుతుంది.పుష్పరజ్ జాలిరెడ్డిని కలిసే సీన్ కూడా పుష్ప ది రూల్ మూవీలో ఉంది.క్లైమాక్స్ లో పెళ్లి సన్నివేశంలో పుష్ప అన్న పుష్పకు గిఫ్ట్ ఇచ్చిన సీన్ ఆకట్టుకునేలా ఉంది.20 నిమిషాల అదనపు ఫుటేజ్ కు సంబంధించిన సీన్లు పుష్ప ది రూల్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పుష్ప ది రూల్ రీలోడెడ్ వెర్షన్( Pushpa The Rule Reloaded Version ) కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ రీలోడెడ్ వెర్షన్ లో యాడ్ చేసిన సీన్లు ఓటీటీ వెర్షన్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.పుష్ప2 మూవీ సాధించిన కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.పుష్ప3 మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు