ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్.
ఈ విషయంతో మరోసారి పుష్ప సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.పుష్పరాజ్ స్నేహితుడిగా జగదీశ్ (Jagadish Pratap Bhandari) కేశవ రోల్ లో పార్ట్ 1 లో నటించి ఫేమస్ అయ్యాడు.
ఇక పార్ట్ 2 లో కూడా కేశవ( Keshava ) రోల్ ఫుల్ లెన్త్ గానే ఉండబోతుందని సమాచారం.పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయ్యిన జగదీష్ పలు సినిమాల్లో అవకాశం అందుకుని మరింత రాణించాడు.
అయితే తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్న క్రమంలో ఇతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారని తెలుస్తుంది.
జగదీష్ కెరీర్ స్టార్టింగ్ లో ఒక అమ్మాయితో షార్ట్ ఫిలిం లో నటించగా ఆమెతో పరిచయం ఏర్పడిందట.
ఇది సన్నిహితంగా మారగా ఇతడికి ఫేమ్ వచ్చిన తర్వాత దూరంగా ఉంటూ వస్తున్నాడట.కానీ ఈ మధ్య ఆమె ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండగా ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసాడట.దీంతో ఈమె ఈ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట.
దీంతో ఆమె తండ్రి ఈ విషయం పోలీసులకు చెప్పడంతో ఇతడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇతడి అరెస్ట్ తో( Arrest ) పుష్ప ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది.ఎందుకంటే ఇతడి షూట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉందట.అతడు బెయిల్ తో బయటకు వచ్చిన తర్వాతనే షూట్ జరగనుందని టాక్ వినిపిస్తుంది.
అయితే కొందరు మాత్రం ఈ సినిమాలో ఇతడిని రీప్లేస్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.చూడాలి ఏం జరుగుతుందో.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy