50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన చిత్రం పుష్ప 2.

( Pushpa 2 ) ఇటీవల గత నెల డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.అంతేకాకుండా బాహుబలి 2 లాంటి రికార్డులను సైతం బద్దలు కొట్టింది.

ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో అర్థ శత దినోత్సవం అలాగే 100 డేస్ వంటి పదాలు చాలా తక్కువగా వినిపిస్తున్నాయి.

సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఎన్ని వందల కోట్లు సాధించినా కూడా మహా అంటే నెలరోజులు కూడా థియేటర్లలో ఆడటం లేదు., దేవర, కల్కి ఇలా ఏది తీసుకున్నా ఇదే జరిగింది.

Advertisement
Pushpa 2 Blockbuster 50 Days Details, Pushpa 2, Tollywood,pushpa 2 50days Center

కానీ పుష్ప 2 ది రూల్ కలెక్షన్లలోనే కాదు చాలా కాలం నిలిచిపోయే రికార్డుల విషయంలోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్ళిపోయింది.

Pushpa 2 Blockbuster 50 Days Details, Pushpa 2, Tollywood,pushpa 2 50days Center

అయితే నేడు ఈ బ్లాక్ బస్టర్ 50వ రోజు.స్ట్రెయిట్, షిఫ్టింగ్ అన్ని కలిపి సుమారు అయిదు వందల స్క్రీన్లలో ఇవాళ ఈ ఫీట్ నమోదయ్యిందని ట్రేడ్ టాక్.థియేటర్ మారకుండా తెలుగు రాష్ట్రాలలో పాతిక పైగానే సెంటర్లు ఉండవచ్చని ఒక రిపోర్ట్.

కాగా రెండు వేల కోట్లకు దగ్గరగా ఉన్న పుష్ప 2 ఇటీవలే రీ లోడెడ్( Pushpa 2 Reloaded ) పేరుతో అదనంగా ఇరవై నిముషాలు జోడించుకుని వచ్చాక మళ్ళీ ఊపందుకుంది.సంక్రాంతి తర్వాత బుక్ మై షోలో గేమ్ ఛేంజర్( Game Changer ) ని దాటేసి పుష్ప 2 ట్రెండింగ్ లోకి రావడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను షాక్ కు గురి చేసింది.

అయితే ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న పుష్ప 2 ఓటిటి విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా ఉపయోగపడింది.

Pushpa 2 Blockbuster 50 Days Details, Pushpa 2, Tollywood,pushpa 2 50days Center
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

అయితే 56 రోజుల దాకా స్ట్రీమింగ్ ఉండదని నిర్మాతలు తేల్చి చెప్పడంతో డిజిటల్ వెర్షన్ కోసం ఎదురు చూసే ప్రయాస పడకుండా అధిక శాతం జనాలు టికెట్లు కొని చూశారు.ఇవాళ హైదరాబాద్ సంధ్యలో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.గ్రాఫిక్స్, ఫాంటసీ లేని ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో వేల కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుడు సుకుమార్ బన్నీ ఇమేజ్ ని అమాంతం పది మెట్లు పైకి ఎక్కించేశారు.

Advertisement

పుష్పని ఒక బ్రాండ్ గా మార్చేశారు.భవిష్యత్తులో ఎప్పుడు పుష్ప 3 తీసినా అంచనాలు ఆకాశాన్ని దాటుతాయని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు.

తాజా వార్తలు