వారిని దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాస్తానంటున్న సుక్కూ.. కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ సుకుమార్.ఈయన ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు అనే చెప్పాలి.

ఒక్క సినిమాతో ఈయన పేరు మారుమోగి పోతుంది.గత కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి కళ్ళలో పడ్డారు.

ఈ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తర్వాత కూడా వరుసగా మంచి మంచి సినిమాలు తీసి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఒకటి అరా సినిమాలు మినహా మిగతా అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇక సుకుమార్ గత సినిమా పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Advertisement
Pushpa 2 Director Sukumar Interesting Comments, Allu Arjun, Pushpa 2, Tollywood

మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

Pushpa 2 Director Sukumar Interesting Comments, Allu Arjun, Pushpa 2, Tollywood

ఇక ఈ సినిమా సీక్వెల్ మీద ఉన్న అంచనాలను చూసి ఈసారి దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నారు.మరి ఇటీవలే ఈ సినిమా పార్ట్ 2 షూట్ గ్రాండ్ గా వైజాగ్ లో స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు.ఇక రెండవ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ ఒక ఈవెంట్ లో భాగంగా చేసిన కామెంట్స్ నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

Pushpa 2 Director Sukumar Interesting Comments, Allu Arjun, Pushpa 2, Tollywood

ఈయన ఈవెంట్ లో మాట్లాడుతూ.తన సినిమాలకు సంబందించిన సాంగ్స్, డైలాగ్స్ రాసేప్పుడు సోషల్ మీడియా ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాస్తానని.మనం రాసే డైలాగ్స్ సోషల్ మీడియా ఆడియెన్స్ ను ప్రభావితం చేస్తారని.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ లో సాంగ్స్, డైలాగ్స్ భారీ స్థాయిలో ఇన్స్టా రీల్స్, షార్ట్స్ రూపంలో వచ్చాయని ఆ విధంగా సినిమాకు మరింత క్రేజ్ లభించిందని చెప్పారు.ఇప్పుడు పుష్ప ది రూల్ కూడా అందరి దృష్టిని ఆకర్షించేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాను అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు