ఆ పని చేస్తే విడాకులు ఎవరు తీసుకోరు.... పూరి జగన్నాథ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) ఇటీవల డబల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి సినిమాలను ప్రకటించలేదు.

ఇకపోతే పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఉంటారు.పాడ్‌కాస్ట్ (Podcast) స్టార్ట్ చేసి పలు విషయాలు వెల్లడిస్తున్నారు.

తాజాగా, పూరి జగన్నాథ్ ఈ ఏడాది అయిపోతుండటంతో న్యూ రిజల్యూషన్ గా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అందరికీ సూచనలు చేశారు.

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకు (Social media)పూర్తిగా బానిసలు అవుతున్నారు.వారి కుటుంబంలో ఒక సంతోషం జరిగిన ఒక బాధ జరిగిన వెంటనే ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.ముఖ్యంగా అమ్మాయిలైతే చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారని పూరి జగన్నాథ్ తెలిపారు.

Advertisement

దయచేసి సోషల్ మీడియాకు దూరంగా ఉండి అద్భుతమైన జీవితాన్ని జీవించండి అంటూ తెలియజేశారు.

మీరు రిలేషన్ లో ఉన్న లేదా కొత్తగా పెళ్లయిన వారు(Newlyweds) ఉన్న వెంటనే సోషల్ మీడియాకు దూరంగా ఉండండి ఈ సోషల్ మీడియా కారణంగానే ఎంతోమంది భార్య భర్తల మధ్య దూరం పెరిగిపోయి విడాకులు (Divorce) తీసుకుని విడిపోతున్నారు.మీ పార్ట్నర్ మీ ప్రపంచం అనుకుని బతకండి మీరు సంతోషంలో ఉన్న బాధలో ఉన్న ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు.నా మాట విని పెళ్లయిన వారందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి విడాకులు కూడా తగ్గిపోతాయి అంటూ పూరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈయన చెప్పిన మాటలలో  100% నిజం ఉందని, సోషల్ మీడియా కారణంగానే ఎంతోమంది భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం జరుగుతుంది అంటూ ఈయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?
Advertisement

తాజా వార్తలు