బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి రిపీట్.. పూరీతో కలిసి చేయబోతున్న ఆ హీరో ఎవరు?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh ) ఇప్పుడు ఫామ్ కోల్పోయాడు అనే చెప్పాలి.

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలను ఎన్నో తెరకెక్కించిన పూరీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా హిట్ అయితే వరుసగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.

ఇష్మార్ట్ శంకర్ ( iSmart Shankar ) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండలో లైగర్ ( Liger ) సినిమాను తెరకెక్కించాడు.విజయ్ మార్కెట్ ను మించి బిడ్జెట్ పెట్టి ఎన్నో అంచనాలతో ఈ సినిమాను రిలీజ్ చేయగా అది అట్టర్ ప్లాప్ అయ్యింది.

దీంతో పూరీ రేసులో మరోసారి వెనుక బడ్డాడు.ఈ సినిమా ఇచ్చిన షాక్ తో పూరీ మొన్నటి వరకు కోలుకోలేక పోయాడు.

అయితే ఇటీవలే రామ్ పోతినేని యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Advertisement

మరి ఈ రూమర్స్ నిజమో కాదో తెలియదు కానీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే నిజంగానే చాలా ఎనర్జిటిక్ గా ఉండే అవకాశం ఉంది.ఇది పక్కన పెడితే తాజాగా పూరీ జగన్నాథ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రామ్ పోతినేనిని మరోసారి లైన్లో పెట్టాడంటూ వార్తలు వస్తున్నాయి.రామ్ ( Ram Pothineni ) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇష్మార్ట్ శంకర్ సినిమా గురించి అందరికి తెలుసు.

మరి ర్ బ్లాక్ బస్టర్ కాంబో ఇప్పుడు రిపీట్ కాబోతుంది అని ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్స్.ఈ కాంబోపై రామ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) దర్శకత్వంలో RAPO20 సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ( RAPO20 ) లో రామ్ కు జోడీగా శ్రీలీల ( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రామ్ గత సినిమా వారియర్ తో ప్లాప్ అందుకోవడంతో బోయపాటి అయిన హిట్ ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.

Advertisement

తాజా వార్తలు