జనసేనతో పొత్తుకు సంబంధించి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!

నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో( Purandheswari ) పాటు సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డి, జీవిఎల్, సత్య కుమార్ హాజరయ్యారు.

అయితే ఈ సమావేశం అనంతరం అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.జనసేనతో( Janasena ) పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతానికి జనసేన తమ మిత్రపక్షంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు.టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన విషయం అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.

తమది జాతీయ పార్టీ అని పొత్తు గురించి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని అన్నారు.అదేవిధంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుగుదేశం పార్టీతో కలవటం నిర్ణయం పట్ల కూడా తాము అప్పుడే స్పందించమని పేర్కొన్నారు.

Advertisement

ఇదిలా ఉంటే మరో పక్క తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.రెండు పార్టీల నేతల జాయింట్ కమిటీ నియామకం త్వరలోనే జరగనుంది.ఇదే సమయంలో వారాహి విజయ యాత్రలో( Varahi Vijaya Yatra ) కచ్చితంగా ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే వస్తుందని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.

జనసేన వారాహి విజయ యాత్రలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు.ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతున్న యాత్రలో తెలుగుదేశం జెండాలు కూడా కనిపిస్తున్నాయి.బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని పవన్ సెప్టెంబర్ 15వ తారీకు జైల్లో చంద్రబాబునీ కలిసిన తర్వాత ప్రకటించడం జరిగింది.

అయితే జనసేన తెలుగుదేశం పొత్తు విషయం జాతీయ నేతలు చూసుకుంటారని పురంధేశ్వరి ఏపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలియజేయడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.

తాజా వార్తలు