తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు నిరసన సెగ

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది.

గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల లో రాత్రి సమావేశం అనంతరం నాయకులతో మాట్లాడేందుకు నల్లజర్లల్లో బస చేశారు చంద్రబాబు.

అయితే చంద్రబాబు బసవద్ద నిరసన వ్యక్తం చేశారు గోపాలపురం నల్లజర్ల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు. పోలవరం గోపాలపురం నియోజకవర్గం అభ్యర్థులను మార్చాలంటూ నిరసనకు దిగారు.

చంద్రబాబు కన్వెన్షన్ హాల్ లోపల నాయకులతో మాట్లాడుతుండగా పోలవరం నియోజకవర్గంలో నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.అలాగే గోపాలపురం నియోజకవర్గంలోని మద్దిపాటి వ్యతిరేక వర్గం నాయకుడైన ముళ్ళపూడి బాబు రాజుకు అనుకూలంగా ఆయన వర్గం నాయకులు నినాదాలు చేశారు.

చంద్రబాబు ఉన్నచోటే నాయకులు నిరసన వ్యక్తం చేయడం విశేషం.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు