Carrot Crop : క్యారెట్ పంటను ఆశించే దుంప కుళ్ళు తెగుళ్లను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

క్యారెట్ పంటను( Carrot Crop ) సాగు చేయాలి అనుకునే రైతులు ముందుగా క్యారెట్ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొంది మంచి లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.క్యారెట్ పంటను శీతాకాలపు పంట( Winter Crop ) అని చెప్పవచ్చు.

ఎందుకంటే.18 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణంలో మంచి నాణ్యమైన క్యారెట్ పంట దిగుబడి పొందవచ్చు.ఆగస్టు నుంచి జనవరి వరకు క్యారెట్ పంట విత్తుకోవడానికి అనువైన కాలం.

ఒక ఎకరాకు సుమారుగా రెండు కిలోల విత్తనాలు అవసరం.క్యారెట్ విత్తుకునే ముందు మొక్కల మధ్య ఐదు సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు సాల్లు తయారు చేసుకుని విత్తుకోవాలి.

క్యారెట్ విత్తనాలు( Carrot Seeds ) చిన్న పరిమాణంలో ఉంటాయి కాబట్టి ఒక కిలో విత్తనాలకు మూడు కిలోల ఇసుక పొడిని కలుపుకొని విత్తుకోవాలి.క్యారెట్ పంట సాగు కోసం ఎత్తుగా ఉండే మట్టి బెడ్లను ఏర్పాటు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించి సాగు చేస్తే క్యారెట్ దుంప ఎదుగుదల బాగా ఉండి దుంప కుళ్ళు తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా ఉండదు.

పొలంలో కలుపు సమస్య తక్కువగా ఉండాలంటే.క్యారెట్ విత్తనాలు విత్తిన 48 గంటల వ్యవధిలో ఒక ఎకరానికి 1.25 లీటర్ల పెండిమిథలిన్ ను నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.30 రోజుల తర్వాత అంతర కృషి చేస్తే కలుపు( Weed ) సమస్య దాదాపుగా ఉండదు.క్యారెట్ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ళ( Pests ) విషయానికి వస్తే దుంప కుళ్ళు తెగుళ్లు ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి.

Advertisement

ఈ తెగుళ్లు రెస్ట్ ఫ్లై ( Rust Fly ) అనే ఒక ఈగ ద్వారా సోకుతుంది.ఈగలు మొక్కపై గుడ్లు పెడతాయి.

ఆ గుడ్ల లో నుంచి బయటకు వచ్చే లార్వాలు దుంప లోపలికి వెళ్లి దుంపలు ఆహారంగా తినడం ప్రారంభిస్తాయి.ఇంత మొక్క ఆకులు వడలిపోయి, ఆకులు తెల్లగా మారుతాయి.మొక్కలలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రెండు మిల్లీ లీటర్ల మాలాథియాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ముందస్తు చర్యలో భాగంగా పంట విత్తిన నాలుగో వారం, 7వ వారంలో పిచికారి చేయడం వల్ల ఈ తెగుళ్లు పంటను ఆశించే అవకాశాలు చాలా తక్కువ.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!
Advertisement

తాజా వార్తలు