కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోరీ ఘటనలో పురోగతి

కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోటు చేసుకున్న చోరీ ఘటనలో పురోగతి లభించింది.

పీఎస్ లో వెండి, నగదు మాయం వెనుక ఇంటి దొంగల హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబును అరెస్ట్ చేశారు.అదేవిధంగా నిందితులకు సహకరించిన భరత్ సింహ, విజయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో నిందితుల నుంచి రూ.10 లక్షల నగదుతో పాటు 81.52 కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు