జగన్‌కు దిమ్మదిరిగే ప్రశ్న వేసిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

తాజాగా రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఈ అంశంపై చాలా ఘాటుగా స్పందించారు.

జగన్‌ సమాధానం చెప్పలేని కొన్ని ప్రశ్నలు ఆయన వేశారు.మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించేటప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జగన్‌ చెప్పుకొచ్చారు కదా.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.ఓ హైకోర్టు ఉన్నంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ.కానీ అంతకన్నా న్యూయార్క్‌ ఎక్కువ అభివృద్ధి చెందింది.

న్యూయార్క్‌లో అధ్యక్షుడు ఉండడు.సుప్రీంకోర్టు లేదు.

Advertisement
Professor Nagaswar Jagana Three Capitals-జగన్‌కు దిమ్మ�

అయినా ఆ నగరం ఎందుకు అభివృద్ధి చెందింది.మన దేశంలోనూ ముంబైలో సుప్రీంకోర్టు ఉందా.

పార్లమెంట్‌ ఉందా.అయినా ఆ నగరం ఢిల్లీ కంటే ఎక్కువ డెవలప్‌ ఎలా అయింది అని నాగేశ్వర్‌.

జగన్‌ను నిలదీశారు.

Professor Nagaswar Jagana Three Capitals

అమరావతిలో అసెంబ్లీ పెట్టి.సచివాలయాన్ని విశాఖలో పెడితే ఎంత ఆర్థిక నష్టమో కూడా ఆయన వివరించారు.ఏడాదిలో 60 రోజులు అసెంబ్లీ జరుగుతుంది.

ఈ 60 రోజుల పాటు సచివాలయం మొత్తం విశాఖ వదిలి అమరావతి రావాల్సిందే కదా.దీనికి ఎంత ఖర్చు అవుతుంది.అలాగే ప్రతి రోజూ హైకోర్టులో ప్రభుత్వంపై ఎన్నో కేసులు నడుస్తుంటాయి.

Advertisement

సచివాలయ సిబ్బంది రోజూ హైకోర్టులో ఉంటారు.ఇప్పుడు హైకోర్టు కర్నూల్లో పెట్టి.

సచివాలయం విశాఖలో పెడితే ఈ కేసుల కోసం అధికారులు వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉండాల్సిందేనా.అసలే డబ్బుల్లేక అమరావతిని అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నారు.

మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని నాగేశ్వర్‌ ప్రశ్నించారు.నిజానికి చాలా మంది ఇదే వాదన వినిపిస్తున్నారు.

జగన్‌ చేస్తోంది పరిపాలన వికేంద్రీకరణ తప్ప అభివృద్ధి కాదని చాలా మంది మేధావులు అభిప్రాయపడుతున్నారు.నిజానికి ఇలా అసెంబ్లీ, సచివాలయం ఒక్కో చోట ఉండటం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు.

తాజా వార్తలు