హీరోల అందరికన్నా నా కొడుకు బాగుంటాడు.. ప్రముఖ నిర్మాత కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో శ్రీనివాసరావు దమ్మలపాటి ఒకరు కాగా ఇండస్ట్రీలో ఈ నిర్మాతను అందరూ డీఎస్ రావు( DS Rao ) అని పిలుస్తారు.

డీఎస్ రావు తక్కువ సినిమాలే నిర్మించినా అభిరుచి ఉన్న నిర్మాతగా ( Producer ) పేరు సంపాదించుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్మాత మాట్లాడుతూ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో ఏ హీరో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదని ఆయన తెలిపారు.మనోజ్ తో తీసిన సినిమా ఇష్టంతో చేసిన సినిమానే అని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.

నేను హీరోలను ఇబ్బంది పెట్టే వ్యక్తిని అయితే పెద్దపెద్ద హీరోలతో సినిమాలు చేసేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో ఇచ్చిన డబ్బులు ఎవరూ తిరిగి ఇవ్వరని కానీ శ్రియ ( Shriya ) మాత్రం 5 లక్షలు రిటర్న్ పంపిందని డీఎస్ రావు అన్నారు.

కొన్ని కారణాల వల్ల శ్రియ మిస్టర్ నూకయ్య మూవీ నుంచి తప్పుకుందని ఆయన తెలిపారు.

Advertisement

హీరోలు మధ్యలో గొడవలు పడితే ఫైనాన్షియర్ల నుంచి సమస్యలు ఎదురవుతాయని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.మేము ఐదుగురం అని రైతు కుటుంబం నుంచి వచ్చానని ఆయన తెలిపారు.సినిమా ఆర్టిస్ట్ కావాలని అనుకున్నానని ఒక వ్యక్తి పరిచయమయ్యాడని ఆ వ్యక్తి సినిమాల్లోకి లాగాడని డీఎస్ రావు కామెంట్లు చేశారు.

నేను కన్ స్ట్రక్షన్ లో ఉండి ఉంటే బాగుండేదని డీఎస్ రావు చెప్పుకొచ్చారు.

చిన్న హీరోలతో సినిమాలు చేయకూడదని ఆయన తెలిపారు.అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నానని డీఎస్ రావు అన్నారు.నా పెద్ద కొడుకు సినిమా హీరోల కంటే అందంగా ఉంటాడని ఆయన అన్నారు.

నా పెద్ద కొడుకు చదువులో టాపర్ అని ఆయన కామెంట్లు చేశారు.నిర్మాత డీఎస్ రావు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు