ఆదిపురుష్‌ విషయంలో ఆయన ఆలోచనే నిజం!

యంగ్ రెబల్‌ స్టార్( Young Rebel Star Prabhas ) రాముడిగా బాలీవుడ్‌ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించి తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా సాధిస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు.

కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్‌ రికవరీ చేయడం గొప్ప విషయం అన్నట్లుగా తెలుస్తోంది.ఆదిపురుష్‌ సినిమా( Adipurush ) ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దాదాపుగా 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా వారికి వచ్చేది ఎంత.పోయేది ఎంత అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ను కొనుగోలు చేయాల్సిందిగా మొదట దిల్ రాజును సంప్రదించారు అంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి.

కానీ దిల్‌ రాజు కొనుగోలు చేసేందుకు నో చెప్పాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) వారు కొనుగోలు చేసిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఏరియా ను ఇచ్చేందుకు రెడీ అన్నట్లుగా పేర్కొన్నారు.

Advertisement

కానీ దిల్‌ రాజు అస్సలు ఆసక్తి చూపించలేదు.శాకుంతలం సినిమా ను టచ్ చేసి దాదాపుగా నాలుగు పదుల కోట్ల నష్టాలను చవి చూసిన దిల్ రాజు బాబోయ్ మరో సాహసం.

ప్రయోగం వద్దు అన్నట్లుగా ఆదిపురుష్ ను సున్నితంగా తిరష్కరించాడు.సినిమా యొక్క టీజర్‌( Adipurush Teaser ) విడుదల కార్యక్రమంలో దిల్‌ రాజు పాల్గొన్నాడు.

అప్పటికి దిల్ రాజు( Dil Raju )కు ఆదిపురుష్ ను కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంది.టీజర్‌ కు వచ్చిన రెస్పాన్స్ మరియు తన శాకుంతలం సినిమా ఎఫెక్ట్ ఏమో కానీ ఆదిపురుష్ సినిమా ను కొనుగోలు చేసేందుకు సాహసం చేయలేదు.ముందు ముందు టాలీవుడ్‌ లో తాను నిర్మిస్తున్న సినిమాలు మరియు తమిళంలో నిర్మిస్తున్న సినిమా లపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆదిపురుష్ ను వద్దు అన్నాడని దిల్‌ రాజు కాంపౌండ్‌ వారు అంటున్నారు.

కానీ ఆదిపురుష్ విషయంలో నమ్మకం లేకపోవడం వల్లే దిల్‌ రాజు కొనుగోలు చేయలేదు అని.ఇప్పుడు ఆయన ఆలోచన నిజం అని తేలిందని మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement

తాజా వార్తలు