కమిషనర్ స్థాయి నుండి క్రింది స్థాయి అధికారులు వరకు ప్రజలలో తిరిగి సమస్యలు పరిష్కరించాలి-అనీల్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు బాధ్యతాయుతంగా ప్రజలలో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సూచించారు.

నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను డివిజన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

పారిశుధ్య, చెత్త పన్ను సమస్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు ముందుండాలని, కమిషనర్ స్థాయి నుండి క్రింది స్థాయి అధికారులు వరకు ప్రజలలో తిరిగి సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

Problems Need To Be Addressed Again Among The People From The Commissioner Level

ప్రజలను ఇబ్బంది చేస్తే కమిషనర్ స్థాయి అధికారి పైన అయిన చర్యలు చేపట్టేందుకు వెనకాడనని ఆయన హెచ్చరించారు.ప్రజలు తమ సమస్యలపై అన్నివేళలా తనని,తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు