కెనడాలో అలజడి .. సోషల్ మీడియాలో ‘‘bot activity’’ని వాడుతోన్న ఖలిస్తాన్ మద్ధతుదారులు

కెనడా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదుల ఆగడాలు పెచ్చుమీరుతున్న సంగతి తెలిసిందే.

హిందూ ఆలయాల ధ్వంసం, భారతీయ దౌత్య కార్యాలయాలపై దాడి, దౌత్య సిబ్బందికి బెదిరింపులు, తోటి భారతీయులపై దాడులు, ఖలిస్తాన్ కోసం రెఫరెండం నిర్వహిస్తూ అలజడి రేపుతున్నారు.

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారు.

అయితే కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు , కెనడాలోని( Canada ) భారతీయ దౌత్యవేత్తలు, ఇండియన్ మిషన్‌లను లక్ష్యంగా చేసుకోవడం వరకు ఇటీవల సోషల్ మీడియాలో ఖలిస్తాన్ అనుకూల ‘‘bot activity’’ పెరిగినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.గతేడాది వేసవిలో దేశంలోని హిందూ దేవాలయాలు, విగ్రహాలు, మహాత్మా గాంధీ విగ్రహాలపై దాడులు జరగడంతో బాట్ కార్యకలాపాలు తెరపైకి వచ్చాయి.

ఆ సమయంలో పాకిస్తాన్‌కు ( Pakistan ) చెందిన పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రమేయాన్ని కూడా నిఘా సంస్థలు గుర్తించాయి.ట్విట్టర్‌ను( Twitter ) పోస్టులతో ముంచెత్తడానికి రోజుల ముందు నుంచే కార్యాచరణ వుంటుంది.

Advertisement

ప్రత్యేకమైన ఈవెంట్‌లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు, విధ్వంసానికి సంబంధించిన ట్వీట్‌లు ఏకకాలంలో చేయబడ్డాయి.ప్రిన్స్‌టన్, న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న నెట్‌వర్కింగ్ కంపెనీ ఎన్‌సీఆర్ఐ( NCRI ) ద్వారా విడుదల చేయబడిన నివేదికలో పేర్కొన్న విధంగా కార్యాచరణ వుంటుందని జాతీయ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

ఈ ఖాతాల నిర్వహణ పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా వుంటుందని ఎన్‌సీఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాక్ డోనోహ్యూ( Jack Donohue ) వ్యాఖ్యానించారు.

కెనడా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలోని దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్‌లను ఈ బాట్ గ్రూప్‌లు వ్యాప్తి చేశాయి.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeepsingh Nijjar ) హత్య వెనుక భారత్ హస్తం వుందన్న ఎస్‌ఎఫ్‌జే హస్తం వుందని అవి ప్రచారం చేశాయి.నిజ్జర్ హత్యపై కెనడాలోని ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) ఇంకా తన దర్యాప్తును పూర్తి చేయలేదు.

అయితే నిజ్జర్ అంత్యక్రియలు జరిగిన స్థలంలో భారతీయ ఏజెంట్‌ను అరెస్ట్ చేసినట్లు బాట్‌లు పోస్ట్ చేశాయి.దీనిపై తక్షణం స్పందించిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అటువంటిదేమి లేదని స్పష్టం చేశారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

బాట్‌లు ఇటీవల భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జూలై 8న ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లోని తమ మిషన్‌ల వెలుపల నిరసనలను విస్తృతం చేశారు.అంతేకాదు.కెనడాలో ఖలిస్తాన్ కార్యకలాపాలపై నివేదించిన జర్నలిస్ట్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.

Advertisement

జూన్ 23, 1985న ఎయిరిండియా ఫ్లైట్ 182 ‘‘కనిష్క’’పై బాంబు దాడికి భారత్ బాధ్యత వహించడం వంటి కుట్ర సిద్ధాంతాలను కూడా బాట్‌లు ముందుకు తెచ్చారు.కానీ ఈ ఘటన వెనుక ఖలిస్తానీల హస్తం వుందని విచారణ సంస్థలు తేల్చారు.

తాజా వార్తలు