ఆ రోజులు నా జీవితంలో చీకటి రోజులు.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత నెమ్మదిగా హాలీవుడ్ కి( Hollywood ) ఎంట్రీ ఇచ్చి అక్కడ సెటిల్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈమె అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్ ను( Nick Jonas ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఒకవైపు హాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన భర్త ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్‌ మళ్లీ మొదటీ నుంచి మొదలైందా? అనే భావన కలిగింది.హాలీవుడ్‌లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు.

ఒంటరిగా ఫీల్ అయ్యాను.చాలా భయం వేసింది.

Advertisement

కొన్ని తిరస్కరణలు కూడా ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్‌లో నా కెరీర్‌ తొలి రోజులు ఒక చీకటి అధ్యాయంలా గడిచాయి.

ఇండియాలో నేనో స్టార్‌ హీరోయిన్‌ ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్‌ లో నా పని చేసుకుంటూ వెళ్లాను.అందుకే ఇప్పుడు హాలీవుడ్‌లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం అని చెప్పుకొచ్చారు ప్రియాంక.హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపింది.

హాలీవుడ్ లో మొదట తన ప్రయాణం కష్టతరంగా మారిందని ఆమె తెలిపింది.ప్రస్తుతం హాలీవుడ్‌లో హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌( Heads Of State ) ఫిల్మ్‌లో నటిస్తున్నారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు