సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి నటి ప్రియమణి( Priyamani ) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ప్రియమణి బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడు సౌత్ సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నారు.ఇక ఇటీవల మైదాన్ ( Maidaan ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ప్రియమణి తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో( Paruthiveeran ) కార్తీ సరసన కథానాయికగా నటించింది.ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది.ఈ సినిమాకు అవార్డులు రావడంతో ఈమెకు తెలుగులో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇకపోతే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ప్రియమణి కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన మొదటి రెమ్యూనరేషన్(First Remuneration) గురించి పలు విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ తాను మొదట అందుకున్న రెమ్యూనరేషన్ 500 రూపాయలని ( Priyamani First Remuneration )తెలియజేశారు.అయితే తన మొదటి రెమ్యూనరేషన్ గా తీసుకున్నటువంటి ఈ డబ్బులను ఇప్పటికీ నా వద్ద అలాగే భద్రంగా ఉంచుకున్నానని ప్రియమణి తెలిపారు.ఇలా 500 రూపాయలతో మొదలైనటువంటి తన ప్రయాణం ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు.అనంతరం వెబ్ సిరీస్ లలోను అలాగే సినిమాలలోను అవకాశాలు అందుకొని దూసుకుపోతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy