ఈ మధ్యకాలంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే దొంగలుగా, వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పోట్లాటకు దిగి అభాసుపాలైన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారి అందరినీ షాక్‌కి గురి చేశాయి.అయితే ఒక్కోసారి టీచర్లు తప్పు లేకపోయినా చిక్కుల్లో పడుతుంటారు.
మంచి మనసున్న వారికి కూడా ఎదురు దెబ్బలు తగలక మానవు.తాజాగా మహారాష్ట్రలో( Maharashtra ) కూడా అదే జరిగింది.
ఒక టీచర్ ఫుడ్ బాగోలేదని అడిగిన పాపానికి వంట మనిషి( Cook ) చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది.దానికి చెందిన వీడియో వైరల్ గా మారింది.
తాజాగా జరిగిన ఈ ఘటనలో కిచిడి( Kichidi ) విషయంలో టీచర్, వంటమనిషి ఒకరికొకరు జుట్టు పట్టుకొని తన్నుకుంటూ భౌతిక దాడి చేసుకున్నారు.ఈ దృశ్యాలు గల వీడియో సోషల్ మీడియాలో చాలా త్వరగా వైరల్ గా మారింది.
దీన్ని చూసి ఛ! ఆ వంట మనిషికి సిగ్గు లేదా అని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, మహారాష్ట్ర, ధరూర్ తాలూకా, జోడు హింగానిలో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది.
ఇందులో ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకంలో( Mid Day Meal ) భాగంగా వంటలు వండుతున్నారు.ఒక వంట మనిషి విద్యార్థుల కోసం రీసెంట్‌గా కిచిడి వండి పెట్టింది.
అయితే ఆ కిచిడి అసలు బాగోలేదని ఒక టీచర్ వంట మనిషిపై మండిపడింది.ఈ విషయంలో ఆమె ఫైర్ కావడంలో తప్పేం లేదు.
అయితే ఈ విషయంతో పాటు సదరు టీచర్ స్కూల్ ఆవరణలో వంట మనిషి భర్త షాప్ తీసేయాలని ఆగ్రహించింది.
తానేం తక్కువ తినలేదు అన్నట్లు సదరు వంట మనిషి ఎదురు సమాధానం చెప్పడం మొదలుపెట్టింది.ఆ విధంగా వీరి మధ్య మాట పెరిగి చివరికి జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా కొట్టుకునేదాకా వెళ్ళింది.నువ్వెవరివే నన్ను అడగడానికి అంటూ సదరు వంటమనిషి ఇష్టరాజ్యంగా టీచర్ జుట్టు పట్టుకొని తన్నేసింది.
సమీపంలోనే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు.మరోవైపు వారిద్దరూ కొట్టుకోవడం చూసి పిల్లలు హడలిపోయారు.
ఈ ఘటన తర్వాత బాధిత టీచర్ మాట్లాడుతూ వంటమనిషి చాలా దురుసుగా ప్రవర్తిస్తుందని, ఆహారం చక్కగా వండాలని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడూ తినలేనంత చెడ్డగా వండుతోందని ఆరోపించారు.ఇకపోతే జరిగిన ప్రైమరీ స్కూల్‌లో 60 మంది విద్యార్థులు ఉన్నారు.వీరందరూ ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి చదువుతున్నారు.
అయితే ఈ ఘటనపై ఏమైనా కేసు నమోదు అయ్యిందా పోలీసులు వంట మనిషిని అరెస్టు చేశారా అనేది తెలియ రాలేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy