భక్తిశ్రద్ధలతో త్రిశూల స్నానం నిర్వహించిన అర్చకులు..

కలకడ సత్యవతి నది తీరాన వెలసిన కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రోజు అర్చకులు విజయసారధి, మహేష్ లు త్రిశూల స్నాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో శాసో్త్రక్తంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా త్రిశూలానికి దేవాలయం ఎదుట ఉన్న పుష్కరిణిలో జలాభిషేకం చేశారు.ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల పల్లకి ఎదుట ఉంచి పంచామృతాభిషేకం, వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.దేవాలయ ధర్మకర్త అఖిలేష్, దేవాలయ కమిటీ సభ్యులు మద్దిపట్ల వెంకట రమణ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, రెడ్డప్ప నాయుడు జి.కుమార్ నాయుడు, రామయ్య చౌదరి, మల్లికార్జున ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతే కాకుండా గుర్రం కొండ మండలం తరిగొండ లో కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారికి కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు.ఉదయాన్నే స్వామి వారిని మేల్కొల్పి దేవాలయ శుద్ధి, తోమాల సేవ, అర్చన పంచామృతాలతో అభిషేకాలను చేశారు.ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తుల కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.

ఆలయాధికారి కృష్ణమూర్తి, నాగరాజ, సిబ్బంది ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇంకా చెప్పాలంటే పెద్ద మండ్యం మండలం గుర్రవాండ్లపల్లి గ్రామ పంచాయతీ బత్తినిగారి పల్లిలో వెలసిన మల్లేశ్వర స్వామి తిరుణాల వైభవంగా జరిగింది.

మల్లేశ్వర స్వామికి వివిధ రకాల పూల తో అలంకరించి పూజలు నిర్వహించారు.ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు బందోబస్తును ఏర్పాటు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై16, మంగళవారం 2024

తాజా వార్తలు