మహిళ తాకితే చాలు ఈ పూజారి స్పృహ తప్పుతాడు.. ఎందుకో తెలుసా?

మధ్యప్రదేశ్​లోని భోపాల్‌లో ఓ విచిత్రమైన కేసు బయటకు వచ్చింది.ఒక పూజారి జస్ట్ టచ్ చేస్తే చాలు కళ్లు తేలేసి స్పృహ తప్పి కింద పడిపోతున్నాడు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది.అయితే ఇలా ఎందుకు జరుగుతుందని అడిగితే తాను ఆంజనేయస్వామికి గొప్ప భక్తుడనని.

అత్యంత పవిత్రమైన బ్రహ్మచారిగా మారిపోయానని.అందుకే మహిళలు టచ్ చెయ్యగానే ఆటోమేటిక్‌గా పడిపోతున్నానని చెబుతున్నాడు.

పూజారి కాబట్టి తాను పనిచేస్తున్న దేవాలయానికి చాలామంది ఆడవారు వస్తున్నారు.దీంతో అతను చాలా భయపడి పోతున్నాడు.

Advertisement

చాలా దూరం నుంచే వారికి ప్రసాదం అందిస్తున్నాడు.ఈ క్రమంలోనే కొందరు భక్తులు కలిసి పూజారిని లోకల్ సైకియాట్రిస్ట్​ వద్దకు తీసుకెళ్లారు.

కాగా జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్​​ డాక్టర్.బైరాగి పూజారికి మెడికల్ టెస్టులు చేశాడు.

అయితే అన్ని టెస్టుల్లోనూ అతని మెంటల్ కండిషన్ సాధారణంగానే ఉందని తేలింది.దాంతో డాక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు.

ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు డాక్టర్ ఆ పూజారికి ఓ పరీక్ష పెట్టారు.‘ఆడ నర్సు నిన్ను టచ్ చేస్తుంది.

Lorem Ipsum Dolor Sit Amet

మహిళ టచ్ చేయగానే నిజంగా నువ్వు స్పృహా కోల్పోతావో లేదో మేం కూడా చూడాలి కదా’ అని పూజారితో డాక్టర్ ఒక డ్రామా స్టార్ట్ చేశారు.అనంతరం అతన్ని ఒక పక్కన కూర్చోబెట్టి మహిళా నర్సుతో కాకుండా, ఒక మగ వ్యక్తి తో పూజారిని టచ్ చేయించాడు డాక్టర్.

Advertisement

అంతే ఆ పూజారి క్షణాల్లోనే తన కుర్చీలో నుంచి లేచి కిందపడిపోయాడు.

ఆ తర్వాత పూజారికి జరిగిన సంగతంతా చెప్పారు.ఇలా కిందపడి పోవడానికి నీకు ఉన్న ఒక మానసిక సమస్యే కారణం అని చెప్పడంతో పూజారి కూడా ఖంగుతిన్నాడు.ఇది హాని కలిగించే పెద్ద సమస్య కాదని, కౌన్సిలింగ్ ఇస్తే ఈ మానసిక సమస్యను నయం చేయవచ్చని డాక్టర్ బైరాగి అన్నారు.

డాక్టర్ బైరాగి ప్రకారం కొందరు భక్తులు చాలా అతిగా భక్తి చేస్తారు.ఈ క్రమంలో వారు ఒక భ్రమలోకి వెళ్లిపోతారు.ఆ భ్రమలో ఉండి తమకు సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నట్లు భావిస్తారు.

ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఊహించుకుంటారు.అలాగే ఈ పూజారి కూడా ఆడవాళ్లు టచ్ చేస్తే తనకేదో అవుతున్నట్లు భ్రమ పడి కింద పడిపోతున్నాడు.