Cucumber Crop: దోస జాతి పంటలను ఆశించే పచ్చ మచ్చల వైరస్ ను నివారించే పద్ధతులు..!

దోసకాయ, పుచ్చకాయ, ఖర్బుజా లాంటి దోస జాతి పంటలకు పచ్చ మచ్చల వైరస్( Green Mottle Virus ) ఆశించి ఊహించని తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.

మట్టిలో ఉండే మొక్కల అవశేషాలలో ఈ వైరస్ చాలా కాలం పాటు జీవిస్తుంది.

తెగులు సోకిన విత్తనాలు, మొక్కలకు అయ్యే గాయాలు, వ్యవసాయ పనిముట్లు, కొన్ని రకాల పెంకు పురుగుల వల్ల ఈ పచ్చ మచ్చల వైరస్ వ్యాప్తి చెందుతుంది.ఈ పచ్చ మచ్చల వైరస్ ను ఎలా గుర్తించాలంటే.

లేత ఆకులపై పసుపు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి ఈనెలు పాలిపోవడం జరుగుతుంది.దీంతో ఆకుల రంగు మారిపోవడం, మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం, మొక్కల ఆకులు నిర్జీవంగా మారడం జరుగుతుంది.

దోసకాయలు పక్వానికి రాకుండానే రాలిపోవడం జరుగుతుంది.

Advertisement

ఈ వైరస్ పంటకు ఆశించకుండా ఉండాలంటే.సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను( Certified Seeds ) మాత్రమే సాగుకు ఎంపిక చేయాలి.పరిశుభ్రం చేసిన పనిముట్లను ఉపయోగించాలి.

ముఖ్యంగా పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి.ఈ వైరస్ లక్షణాల కోసం పొలాన్ని తప్పకుండా గమనిస్తూ ఉండాలి.

వైరస్ సోకిన మొక్కలు( Infected Plants ) కనిపిస్తే వెంటనే వాటిని పీకేసి కాల్చి నాశనం చేయాలి.ఈ తెగులు సోకే అవకాశం ఉన్న మొక్కలు ఒకదానికి మరొకటి తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ వైరస్ ను అరికట్టాలంటే.విత్తనాలను 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొడి వేడి చేస్తే అవి చురుకైన వైరస్ కణాల నుండి విముక్తి పొందుతాయి.నమిలే కీటకాలను లక్ష్యంగా చేసుకుని సేంద్రీయ క్రిమిసంహరకాలను వాడాలి.

అందుబాటులో ఉంటే,CGMMV టెస్ట్ కిట్స్ ఉపయోగించాలి.ఇక రసాయన పద్ధతిలో ఈ వైరస్ ను అరికట్టాలంటే.

Advertisement

వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలు తీసుకొని నమిలే కీటకాలను లక్ష్యంగా చేసుకుని రసాయన పిచికారి మందులను ఉపయోగించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు.ఈ వైరస్ కు నేరుగా చికిత్స చేయడం సాధ్యం కాదు.

తాజా వార్తలు