ప్రశాంత్ కిషోర్ సర్వే...తలపట్టుకున్న జగన్..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు.అవకాశం ఉండగానే దూసుకుపోవాలి అంటారు.

సామెతలు ఊరికే పుట్టలేదు.ఎంతో మంది అనుభవజ్ఞులైన వారు చెప్పిన వారు చెప్పే సూత్రలని ఎప్పటికప్పుడు ఫాలో అయిపోవాలి అయితే అందివచ్చిన అవకాశాలని ఉపయోగించు కోవడం లో ఏపీ లో చంద్రబాబు కి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.

ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చాలా వీక్ అనే చెప్పాలి.ఎందుకంటే కేంద్రం విభజన హమీలని నెరవేర్చకుండా.

ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా జగన్ తన గళాన్ని ఎత్తుకున్నారు.ఒక పక్క పాదయాత్ర చేస్తూనే మరో పక్క ప్రత్యేక హోదా ఉద్యమం చేసి ఒక్కసారిగా ఏపీలో ప్రజలని తనవైపు తిప్పుకున్నారు.అయితే

Advertisement

ఇదే సమయంలో కేంద్రం తో గొడవలు పడి బయటకి వచ్చేసిన చంద్రబాబు ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించిన బాబు ఎంతో చాకచక్యంగా ఉద్యమాన్ని తనవైపుకి తిప్పుకున్నారు.అయితే ఈ క్రమంలో నే బీజేపి తో చేతులు కలపడం తో జగన్ ఉద్యమం మెల్ల మెల్లగా నీరు గారిపోతూ వచ్చింది అయితే ఇదే సమయంలో హోదా కోసం హామీల కోసం తన ఎంపీలతో రాజీనామలు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఊహించని మద్దతు ప్రజల నుంచి వచ్చింది.ఈ ఊపుని ఇలాగే చేసిఉంటే బాగుండేది అయితే బీజేపి సూచనలతో జగన్ వెనకడుగు వేశాడు అయితే బాబు మాత్రం ఎదో ఒక రూపంలో ఇప్పటికే నిరసనలు తెలుపుతూ పార్టీపై ప్రజలకి మరింత నమ్మకాన్ని కలిగేలా చేశారు.

అయితే తాజాగా వైసీపి ఎంపీల రాజానామాలని స్పీకర్ ఆమోదించిన తరుణంలో గతంలో రాజీనామాలు చేస్తామని ప్రకటిస్తేనే ప్రజలలో భారీ రెస్పాన్స్ వచ్చింది ఈ సారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనుకున్న జగన్ అండ్ కో కి ప్రజలు గూబ గుయ్యిమని సమాధానం ఇచ్చారట.కనీసం స్పీకర్ ఎంపీల రాజీనామా ఆమోదించిన సమయంలో ఎవరూ రెస్పాన్స్ అవ్వలేదు కనీసం హడావిడి కూడా లేదు దాంతో జగన్ ప్రశాంత్ కిశోర్ ని పిలిచి తాజాగా జరిగిన పరిస్థితులపై సర్వే చేయమని చెప్పాడట.

అయితే ఈ సర్వే సారంశం ఏమిటంటే.రాజీనామాలని స్పీకర్ ఆమోదించిన విషయంలో ప్రజలలో స్పందన ఎలా ఉంది అని అయితే ఆ సర్వేలో వచ్చిన రిజల్స్ చూసిన జగన్ రెడ్డి కి మైండ్ బ్లాకి అయ్యిందట.

సర్వేలో ఏమి తెలిసిందంటే ఏపీ ప్రజలలో కనీసం 10 శాతం మంది ప్రజలు కూడా ఈ విషయంపై చర్చించుకోలేదట ఈ పరిస్థితికి రీజన్ ఏంటో దానికి కారణం కూడా చెప్పారట ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎప్పుడు చంద్రబాబు నే టార్గెట్ చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాటకూడా అనడం లేదు.అసలు హోదా ఇచ్చేది చంద్రబాబు నా లేక కేంద్రమా అని ఘాటుగానే ప్రశ్నించారట.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

దాంతో జగన్ చంద్రబాబును టార్గెట్ చేసి అదే గోతిలో పడ్డాడని అర్థం అవుతోంది.ఆంతేకాదు జగన్ పాదయాత్ర చేసిన సంపాదించిన మైలేజ్ కాస్తా మోడీ తో జట్టుకట్టి ఒక్కదెబ్బతో పోగొట్టుకున్నారట టాక్ వినిపిస్తోంది.

Advertisement

అయితే ఈ విషయాలే పీకే తమ అధినేత పవన్ కళ్యాణ్ కి విన్నవించడంతో జగన్ ఒక్క సరిగా షాక్ కి గురయ్యాడట.ఈ విషయంపై త్వరలో పార్టీలోని కీలక నేతలతో సమావేశం అయ్యి చర్చించనున్నారని తెలుస్తోంది.

తాజా వార్తలు