తొలి సినిమాలోనే పౌరాణిక పాత్రలో మోక్షజ్ఞ.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

అయితే అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం తండ్రి బాలకృష్ణతో( Balakrishna ) కలిసి ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు.అప్పటి నుంచి సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల కాలంలో వరుసగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అలాగే లేటెస్ట్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇకపోతే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా రాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Prasanth Varma Is Making A Story Details, Prashanth Varma, Mokshagna, Tollywood

ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలనుకుంటున్నట్లు ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఒక సూపర్ హీరో కథ తోనే మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ఇప్పటివరకు టాక్ నడిచింది.కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం.

Advertisement
Prasanth Varma Is Making A Story Details, Prashanth Varma, Mokshagna, Tollywood

మహాభారతంలో( Mahabharatam ) ఒక క్యారెక్టర్ బేస్ చేసుకొని ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కోసం ఒక కథని సిద్ధం చేస్తున్నాడట.

Prasanth Varma Is Making A Story Details, Prashanth Varma, Mokshagna, Tollywood

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా పౌరాణికం రిఫరెన్స్ తో అభిమాన్యుడి క్యారెక్టర్ లో మోక్షజ్ఞను చూపిస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ ఫీల్ అవుతున్నారట.మరి ఈ వార్తల్లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే.ఒకవేళ ఇదే వార్త నిజం అయితే మోక్షజ్ఞ మొదటి చిత్రంతోనే భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశలు ఉన్నాయి.

అన్నట్టు ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు