మళ్లీ తండ్రయిన ప్రకాష్‌ రాజ్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌.ఈయన 50 సంవత్సరాల వయస్సులో మళ్లీ తండ్రి అయ్యాడు.

కొన్నాళ్ల క్రితం పోనీ వర్మను ప్రకాష్‌ రాజ్‌ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.తాజాగా వీరిద్దరికి బాబు పుట్టాడు.

ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్‌ రాజ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.పోనీ నేను చాలా సంతోషంగా ఉన్నామని, మాకు బాబు పుట్టాడు మీ ఆశీర్వాదాలు కావాలి అంటూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు.

గతంలోనే ప్రకాష్‌ రాజ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వారు మొదటి భార్య లలిత కుమారి పిల్లలు.

Advertisement

ఆ ఇద్దరు అమ్మాయిలు పెద్ద వారు కూడా అయ్యారు.ఏవో కారణాల వల్ల ఇద్దరు పిల్లలు పెద్ద అయిన తర్వాత లలితతో ప్రకాష్‌ రాజ్‌ విడాకులు తీసుకున్నాడు.

కొరియోగ్రాఫర్‌ అయిన పోనీని మూడు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.అప్పటి నుండి కూడా వీరిద్దరి కాపురం అన్యోన్యంగా సాగుతోంది.

తాజాగా వీరి కాపురంకు గుర్తుగా ఒక బాబు కూడా వీరికి పుట్టాడు.ఈ సందర్బంగా ప్రకాష్‌ రాజ్‌ మరియు పోనీలకు మా, మీ తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

Poker Dom : обзор платформы и её возможностей для игроков из Казахстана
Advertisement